అను ఇమ్మాన్యుయేల్ తప్పు చేసిందట
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “అజ్ఞాతవాసి” సినిమాలో హీరోయిన్ గా నటించింది అను ఇమ్మాన్యుయేల్. ఈ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఆ సినిమా హిట్ అయ్యుంటే అనూ పరిస్థితి మరోలా ఉండేదిప్పుడు. కానీ అలా జరగకపోయేసరికి, సినిమా ఒప్పుకున్నప్పుడు వచ్చిన క్రేజ్ విడుదలయ్యాక మాయమైపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” కూడా అను ఇమ్మాన్యుయేల్ ను ఆదుకోకపోవడంతో కెరీర్ విషయంలో పూర్తిగా చతికిల […]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “అజ్ఞాతవాసి” సినిమాలో హీరోయిన్ గా నటించింది అను ఇమ్మాన్యుయేల్. ఈ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఆ సినిమా హిట్ అయ్యుంటే అనూ పరిస్థితి మరోలా ఉండేదిప్పుడు. కానీ అలా జరగకపోయేసరికి, సినిమా ఒప్పుకున్నప్పుడు వచ్చిన క్రేజ్ విడుదలయ్యాక మాయమైపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” కూడా అను ఇమ్మాన్యుయేల్ ను ఆదుకోకపోవడంతో కెరీర్ విషయంలో పూర్తిగా చతికిల బడిపోయింది ఈ భామ.
ప్రస్తుతం తెలుగులో అనూ చేస్తున్న సినిమాల సంగతి పక్కన పెడితే, తమిళంలో స్టార్ హీరో ధనుష్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. ఇది ఆమెకి బంపర్ ఛాన్సే అని చెప్పాలి. గతంలో విశాల్ సరసన “తుప్పరివాలన్” చిత్రంలో నటించింది. ఈ సినిమాలో అను ఎమ్మాన్యుల్ పాత్రకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉంటుంది. కానీ తెలుగు లో మాత్రం కథకి ప్రాధాన్యం లేని పాత్రలు ఒప్పుకొని తప్పు చేశాను అనుకుంటుంది అను. ఇక మీదట ఫ్యూచర్ లో తెలుగు లో అలాంటి సినిమాలు అస్సలు ఒప్పుకోను అని ఖరాకండిగా చెప్పేసింది అను.