Telugu Global
NEWS

నామినేషన్ టైం.... మంచి రోజు ఇదే.... ముహూర్తాల వేటలో నేతలు....

అసలే ఎన్నికల టైం…. ఎక్కడ ఏ విషయాన్ని లైట్ తీసుకోకుండా నేతలు పనులు చక్కదిద్దుకుంటున్నారు. ఎమ్మెల్యే కుర్చీ ఎక్కి మంత్రి పదవులు చేపడుతామని కలలుగంటున్నారు. ఈ నేపథ్యంలో ముహూర్త బలాన్ని కూడా చూసుకుంటున్నారు. ఎన్నికల వేళ అత్యంత కీలకమైన ముహూర్తాలను వెతికి పట్టుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కు వేళవుతోంది. నవంబర్ 12 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. కానీ ఇప్పటికీ మహాకూటమిలో టికెట్ల పోరు ఓ వైపు సాగుతూనే ఉంది. రేపోమాపో అన్ని రాజకీయ పార్టీలు తమ […]

నామినేషన్ టైం.... మంచి రోజు ఇదే.... ముహూర్తాల వేటలో నేతలు....
X

అసలే ఎన్నికల టైం…. ఎక్కడ ఏ విషయాన్ని లైట్ తీసుకోకుండా నేతలు పనులు చక్కదిద్దుకుంటున్నారు. ఎమ్మెల్యే కుర్చీ ఎక్కి మంత్రి పదవులు చేపడుతామని కలలుగంటున్నారు. ఈ నేపథ్యంలో ముహూర్త బలాన్ని కూడా చూసుకుంటున్నారు. ఎన్నికల వేళ అత్యంత కీలకమైన ముహూర్తాలను వెతికి పట్టుకుంటున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ కు వేళవుతోంది. నవంబర్ 12 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. కానీ ఇప్పటికీ మహాకూటమిలో టికెట్ల పోరు ఓ వైపు సాగుతూనే ఉంది. రేపోమాపో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఆ జాబితాలో ఏ పేర్లు ఉండబోతున్నాయో ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా తెలుసుకున్న నేతలు ఇప్పుడు జ్యోతిష్యుల వద్దకు పరుగులు పెడుతున్నారట. సెంటిమెంట్ కు విలువనిస్తూ జాతకాలు చూపించుకుంటున్నారు.

నవంబర్ 12 నుంచి 19వరకు నామినేషన్లు స్వీకరించేందుకు ఇప్పటికే ఈసీ ప్రకటన చేసింది. మధ్యలో కేవలం 8 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇందులో 18న ఆదివారం కావడంతో నామినేషన్లకు సెలవు. 12న పంచమి తిథి. పూర్వాషాఢ నక్షత్రం బాగానే ఉంటుంది. 13న షష్టి తిథి ఉత్తరాషాడ నక్షత్రం అయినప్పటికీ మంగళవారం కావడంతో కొందరికి అనుకూలంగా లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇక 14న బుధవారం సప్తమి తిథి శ్రవణ నక్షత్రం కావడంతో ఎక్కువ మంది ఈరోజే నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. 15న ఉదయం 8.45 గంటల వరకే సప్తమి ఉంది. దీంతో 15న ఆఫీసులు తెరిచే సరికే సమయం అయిపోతుంది. 16న అష్టమి తిథి.. ధనిష్ట నక్షత్రం కావడంతో ఎవ్వరూ నామినేషన్లు వేయడానికి సాహసించరు. 17న నవమి తిథి, శతబిష నక్షత్రం ఉండగా మధ్యాహ్నం 2.26 గంటలకు నవమి వెళ్లి…. దశమి రావడంతో ఆ రోజు మంచి రోజుగా భావించి ఎక్కువగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది.

18న ఆదివారం సెలవు. ఇక 19న చివరి రోజైన సోమవారం ఏకాదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం కావడంతో మంచి రోజు అని ఈరోజు కూడా భారీగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు తమ జాతకాల రీత్యా ఏ తిథి, ఏరోజు మంచిదో తెలుసుకోవడానికి పంతుళ్ల వద్దకు క్యూ కడుతున్నారు.

First Published:  28 Oct 2018 1:27 AM IST
Next Story