Telugu Global
NEWS

జగన్‌పై దాడి కేసు... రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం డ్రామా అంటూ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు హేళన చేస్తూ మాట్లాడారు. అయితే ఏపీలో పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి ముమ్మాటికి హత్య చేసేందుకే జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు. దాడి జరిగిన విధానాన్ని రిమాండ్ రిపోర్టులో వివరించారు. జగన్‌ను హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాసరావు వచ్చారని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. జగన్‌ మెడపై దాడి చేసేందుకు శ్రీనివాసరావు వచ్చారని.. […]

జగన్‌పై దాడి కేసు... రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
X

వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం డ్రామా అంటూ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు హేళన చేస్తూ మాట్లాడారు. అయితే ఏపీలో పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి ముమ్మాటికి హత్య చేసేందుకే జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు.

దాడి జరిగిన విధానాన్ని రిమాండ్ రిపోర్టులో వివరించారు. జగన్‌ను హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాసరావు వచ్చారని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. జగన్‌ మెడపై దాడి చేసేందుకు శ్రీనివాసరావు వచ్చారని.. కానీ జగన్‌ కుడి వైపుకు తిరగడంతో కత్తి భుజం మీదకు దిగిందని రిపోర్టులో వివరించారు. ఒకవేళ కత్తి మెడకు తగిలి ఉంటే జగన్‌ చనిపోయి ఉండేవారని స్పష్టంగా వెల్లడించారు.

ఘటన జరిగిన సమయంలో ఏపీ ప్రోటోకాల్‌ ఇన్‌స్పెక్టర్‌ వాసుదేవ్‌ అక్కడే వున్నారని కూడా రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించారు. నిందితుడి జేబులో మరో పదునైన కత్తి ఉందని, జగన్‌ హత్యకు నిందితుడు పథకం ప్రకారమే ప్లాన్‌ చేశాడని విచారణలో వెల్లడైందని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. 25వ తేదీన వైఎస్‌ జగన్‌ ఎయిర్‌పోర్టుకు వస్తారన్న సమాచారం తెలుసుకున్న శ్రీనివాస్‌.. ఒక రోజు ముందుగానే కత్తులను ఎయిర్‌పోర్ట్‌లోకి తెచ్చుకున్నాడని, సీసీ కెమెరాలు కవర్‌ చేయని ప్రాంతంలో ఆ కత్తులను దాచాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

దాడి జరగడానికి ముందు రమాదేవి అనే ఉద్యోగి జగన్‌కు కాఫీ తెచ్చి ఇచ్చినట్టు రిమాండ్ రిపోర్టులో వివరించారు. ఆమెతో పాటు వచ్చిన శ్రీనివాసరావు వాటర్ బాటిల్ ఇచ్చే నెపంతో జగన్‌ వద్దకు వచ్చి చాలా సేపు అక్కడే నిలబడ్డారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. వైసీపీ నేత కరణం ధర్మశ్రీతో జగన్‌ మాట్లాడుతున్న సమయంలో శ్రీనివాసరావు జగన్‌పై కత్తితో దాడి చేశారని వెల్లడించారు. ఏపీ పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం జగన్‌పై జరిగింది హత్యాప్రయత్నమేనని తేలిపోయింది.

First Published:  28 Oct 2018 6:25 AM GMT
Next Story