Telugu Global
International

సిరియా కంటే పాకిస్తానే డేంజర్.... జీటీటీఐ నివేదిక....

గ్లోబల్ టెర్రర్ థ్రెట్ ఇండికెంట్ (జీటీటీఐ) నివేదిక పాకిస్తాన్ బండారాన్ని బయటపెట్టింది. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, స్ట్రాటజిక్ ఫోర్ సైట్ గ్రూపులు సంయుక్తంగా ఈ నివేదికను తయారు చేశాయి. దీని ప్రకారం ప్రపంచంలోనే సిరియా కంటే కూడా పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద దేశం అని నివేదికలో పేర్కొంది. సిరియా కంటే పాకిస్తాన్ కారణంగానే మానవజాతికి ఉగ్రవాద ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉందని నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. ఉగ్రవాదులకు పురిటిగడ్డగా…. ప్రపంచ ఉగ్రవాదానికి […]

సిరియా కంటే పాకిస్తానే డేంజర్.... జీటీటీఐ నివేదిక....
X

గ్లోబల్ టెర్రర్ థ్రెట్ ఇండికెంట్ (జీటీటీఐ) నివేదిక పాకిస్తాన్ బండారాన్ని బయటపెట్టింది. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, స్ట్రాటజిక్ ఫోర్ సైట్ గ్రూపులు సంయుక్తంగా ఈ నివేదికను తయారు చేశాయి. దీని ప్రకారం ప్రపంచంలోనే సిరియా కంటే కూడా పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద దేశం అని నివేదికలో పేర్కొంది. సిరియా కంటే పాకిస్తాన్ కారణంగానే మానవజాతికి ఉగ్రవాద ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉందని నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది.

ఉగ్రవాదులకు పురిటిగడ్డగా…. ప్రపంచ ఉగ్రవాదానికి మద్దతు కేంద్రంగా పాకిస్తాన్ మారిపోయిందని జీటీటీఐ నివేదిక నిగ్గుతేల్చింది. పాకిస్తాన్ లోనే పురుడుపోసుకొని అప్ఘనిస్తాన్ కు విస్తరించిన తాలిబన్లు, లష్కరే తోయిబా సంస్థలు అంతర్జాతీయ భద్రతకు పెను ముప్పుగా పరిగణించాయని నివేదిక లో పొందుపరిచారు.

ప్రపంచంలోనే అత్యధిక ఉగ్రవాద స్థావరాలున్న దేశం పాకిస్తాన్ అని జీటీటీఐ నివేదిక స్పష్టం చేసింది. పాకిస్తాన్ మద్దతుతోనే ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని…. అఫ్ఘనిస్తాన్ లో పనిచేస్తున్న పలు గ్రూపులకు కూడా పాకిస్తాన్ మద్దతు ఉందని తేల్చారు. పాకిస్తాన్ సామూహిక వినాశక ఆయుధాలను ఉగ్రవాదులకు ఇచ్చి విధ్వంసాలకు కారణమవుతోందని పేర్కొన్నారు.

21వ శతాబ్ధంలో తొలి పదేళ్లలో ప్రపంచవ్యాప్త ఉగ్రవాద కార్యకలాపాల్లో దాదాపు 200 ఉగ్రవాద సంస్థలను పరిశీలించిన జీటీటీఐ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదిగి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ ఐసీస్ అని తేల్చింది. ఆ తర్వాత బిన్ లాడెన్ కుమారుడి ఆధ్వర్యంలో పునర్ నిర్మాణం అవుతున్న అల్ ఖైదా రెండో ప్రమాదకర ఉగ్రవాద సంస్థగా పేర్కొంది.

First Published:  27 Oct 2018 6:53 AM IST
Next Story