Telugu Global
National

శబరిమలపై బీజేపీ స్టాండ్ తేటతెల్లం.... అమిత్ షా సంచలన కామెంట్స్

శబరిమలలోకి మహిళల ప్రవేశంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతునిచ్చింది. కేరళలోని సీపీఎం ప్రభుత్వం కూడా దీనికి మద్దతు పలికింది. కానీ కేరళలోని సాధారణ ప్రజలు, మహిళలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శబరిమల ఆలయంలోకి వచ్చే మహిళలను అడ్డుకుంటున్నారు. ఇందులో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువగా ఉంటున్నారు. శబరిమలలోకి మహిళలను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న దాదాపు 2,800 మందిని తాజాగా కేరళ ప్రభుత్వం అరెస్ట్ చేసి […]

శబరిమలపై బీజేపీ స్టాండ్ తేటతెల్లం.... అమిత్ షా సంచలన కామెంట్స్
X

శబరిమలలోకి మహిళల ప్రవేశంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతునిచ్చింది. కేరళలోని సీపీఎం ప్రభుత్వం కూడా దీనికి మద్దతు పలికింది. కానీ కేరళలోని సాధారణ ప్రజలు, మహిళలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శబరిమల ఆలయంలోకి వచ్చే మహిళలను అడ్డుకుంటున్నారు. ఇందులో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువగా ఉంటున్నారు.

శబరిమలలోకి మహిళలను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న దాదాపు 2,800 మందిని తాజాగా కేరళ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇందులో ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. దీంతో అమిత్ షా ఈరోజు కేరళ వచ్చి కన్నూర్ లో నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శబరిమల వివాదంపై బీజేపీ స్టాండ్ ఏంటో తేటతెల్లం చేశాడు.

శబరిమలలోకి మహిళలను వెళ్లనీయకుండా అడ్డుకున్న 2,800 మందిని కేరళ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు. కేరళలోని కమ్యునిస్టు ప్రభుత్వం కావాలనే శబరిమల వివాదాన్ని రాజకీయం చేస్తూ తప్పుగా తీసుకెళుతోందని మండిపడ్డారు.

‘కేరళలో నేడు ప్రజల మత విశ్వాసాలకు…. రాష్ట్ర ప్రభుత్వ క్రూరత్వానికి మధ్య పోరాటం కొనసాగుతోంది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం శబరిమల సమస్యను దుర్వినియోగం చేసింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, నేతలను అరెస్ట్ చేసేందుకు ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం ఉపయోగించుకుంది’’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు.

‘కేరళలో ఉన్న కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రిని తాను హెచ్చరిస్తున్నానని…. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసే పేరుతో భక్తులను అణిచివేయవద్దు’ అని అమిత్ షా హెచ్చరించారు. దేవాలయాలు, దేవుళ్లకు కమ్యూనిస్టులు ఎప్పుడూ వ్యతిరేకమని…. వారికి ప్రజల మనోభావాలు పట్టవని…. పోలీసులతో అణిచివేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని అమిత్ షా హెచ్చరించారు.

కేరళ ప్రజలకు, అయ్యప్ప భక్తులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అమిత్ షా అభయమిచ్చారు. అరెస్ట్ చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్, సాధారణ భక్తులను విడిపించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల సెంటిమెంట్ కు మద్దతుగా కేరళ ప్రభుత్వానికి బీజేపీ పర్వతంలా ఎదురు నిలుస్తుందని…. కేరళ ప్రజలకు భరోసానిస్తున్నానని అమిత్ షా కుండబద్దలు కొట్టారు.

కేరళలో పర్యటించి సీపీఎం ప్రభుత్వానికి హెచ్చరికలతో పాటు శబరిమలపై బీజేపీ వైఖరిని కూడా అమిత్ షా తేటతెల్లం చేశారు. శబరిమలలోకి మహిళల ప్రవేశానికి బీజేపీ వ్యతిరేకమని చెప్పకనే చెప్పేశారు.

First Published:  27 Oct 2018 9:30 AM IST
Next Story