Telugu Global
Cinema & Entertainment

పాటలు వచ్చాయి.. ఊపు మాత్రం లేదు

ఎందుకో సవ్యసాచి సినిమాకు సంబంధించి ఆది నుంచి అంతా స్తబ్దుగా సాగుతోంది వ్యవహారం. టీజర్ రిలీజ్ చేసినా, ట్రయిలర్ విడుదల చేసినా ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. అరవింద సమేత ఎఫెక్ట్ వల్లే సవ్యసాచికి ఆశించిన స్థాయిలో ప్రచారం రాలేదనే వాదన కూడా ఉన్నప్పటికీ.. ఇప్పుడా సినిమా విడుదలై 2 వారాలు దాటిపోయింది. ఇలాంటి టైమ్ లో సవ్యసాచి సినిమా నుంచి జ్యూక్ బాక్స్ రిలీజ్ అయింది. ఎప్పట్లానే ఎలాంటి చప్పుడు లేదు. సవ్యసాచి సినిమాలో మొత్తం […]

పాటలు వచ్చాయి.. ఊపు మాత్రం లేదు
X

ఎందుకో సవ్యసాచి సినిమాకు సంబంధించి ఆది నుంచి అంతా స్తబ్దుగా సాగుతోంది వ్యవహారం. టీజర్ రిలీజ్ చేసినా, ట్రయిలర్ విడుదల చేసినా ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. అరవింద సమేత ఎఫెక్ట్ వల్లే సవ్యసాచికి ఆశించిన స్థాయిలో ప్రచారం రాలేదనే వాదన కూడా ఉన్నప్పటికీ.. ఇప్పుడా సినిమా విడుదలై 2 వారాలు దాటిపోయింది. ఇలాంటి టైమ్ లో సవ్యసాచి సినిమా నుంచి జ్యూక్ బాక్స్ రిలీజ్ అయింది. ఎప్పట్లానే ఎలాంటి చప్పుడు లేదు.

సవ్యసాచి సినిమాలో మొత్తం 7 పాటలున్నాయి. కీరవాణి కంపోజ్ చేసిన ఈ 7 పాటల్లో 2 పాటలు నిజంగా బాగున్నాయి. కనీసం వాటిని పైకి తీసుకొచ్చి ప్రచారం చేసినా బాగుండేది. చివరికి ఇందులో నాగార్జున హిట్ సాంగ్ కు రీమిక్స్ కూడా ఉంది. దాన్ని కూడా ప్రమోషన్ లో వాడట్లేదు. ఓవైపు అరవింద సమేత ఎఫెక్ట్ ఉంటే, మరోవైపు యూనిట్ చేసిన చిన్నచిన్న తప్పుల వల్ల సవ్యసాచి సినిమా సైడ్ ట్రాక్ లో పడిపోయింది.

ఈ సినిమా విడుదలకు సరిగ్గా వారం రోజులు మాత్రమే టైం ఉంది. తాపీగా ఇప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారు. హీరోయిన్ ను రంగంలోకి దించారు. నిధి అగర్వాల్ కు ఇదే తొలి సినిమా. ఆమె ఎలా సినిమాకు క్రేజ్ తీసుకొస్తుందో యూనిట్ కే అర్థంకావాలి.

సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఆ కార్యక్రమంతోనైనా సవ్యసాచికి ఊపొస్తుందేమో చూడాలి. నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది ఈ మూవీ.

First Published:  26 Oct 2018 11:06 AM IST
Next Story