Telugu Global
NEWS

టీఆర్ఎస్ ఆశలన్నీ వాళ్లపైనే

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారం ఊపందుకుంది. అనుకూలంగా ఉన్న అంశాలను టీఆర్ఎస్ బేరీజు వేసుకుంటోంది. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చకపోయినా, ఆ ఒక్క పథకంపైనే ఆశలు పెట్టుకుంది. ‘ఆసరా’ పథకం ద్వారా ఎంతో మందికి నెలనెలా పింఛను ఇస్తోంది. క్షేత్రస్థాయిలో వీరు పెద్ద ఓటు బ్యాంకుగా టీఆర్ఎస్ భావిస్తోంది. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ‘ఆసరా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు నెలనెలా పింఛను […]

టీఆర్ఎస్ ఆశలన్నీ వాళ్లపైనే
X

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారం ఊపందుకుంది. అనుకూలంగా ఉన్న అంశాలను టీఆర్ఎస్ బేరీజు వేసుకుంటోంది. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చకపోయినా, ఆ ఒక్క పథకంపైనే ఆశలు పెట్టుకుంది. ‘ఆసరా’ పథకం ద్వారా ఎంతో మందికి నెలనెలా పింఛను ఇస్తోంది. క్షేత్రస్థాయిలో వీరు పెద్ద ఓటు బ్యాంకుగా టీఆర్ఎస్ భావిస్తోంది.

2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ‘ఆసరా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు నెలనెలా పింఛను ఇస్తానని ప్రకటించింది. 39,40, 000 మందికి పైగా పింఛన్లు అందజేస్తుంది. వీరిలో 13,31,987 మంది వృద్ధాప్య పింఛనుదారులు ఉన్నారు. 4,95,404 మంది వికలాంగులు, 14,38,681 మంది వితంతువులు, 4,8,675 మంది బీడీ కార్మికులు, 1,31,032 మంది ఒంటరి మహిళలు, గీత కార్మికులు 62590 మంది, నేత కార్మికులు 37,104, ఎయిడ్స్ పేషెంట్లు 21,045 మంది, బోదకాలు రోగులు 13,606 మంది, వృద్ధ కళాకారులు 417 మంది ఉన్నారు.

ఈ పింఛన్ల కోసం దాదాపు అర కోటి పైగానే ఖర్చు పెడుతున్నారు. గతంలో ఉన్న 200 రూపాయలను పెంచి రూ.1000, 1500 వరకు ఇస్తున్నారు.. మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా పింఛను దారులకు అందేలా ఏర్పాటు చేశారు. అంతేగాక ఇప్పటి మేనిఫెస్టోలో కొత్తగా ఈ పింఛన్లను పెంచి ఇస్తామని ప్రకటించారు. రూ. 1000 ను 2,016కు, రూ.1500 తీసుకునే వారికి రూ.3016కు పెంచి ఇస్తామని పేర్కొంటున్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక ప్రజలకు చేసిన మహోపకారంగా టీఆర్ఎస్ శ్రేణులు ఈ పింఛన్ పథకాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. తమకు బాగా బూస్టింగ్ ఇచ్చే అంశంగా దీన్ని భావిస్తున్నారు. మరోవైపు ఈ పింఛన్లలో కేంద్ర వాటా కూడా ఉందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇంకా తమ మేనిఫెస్టో ఏమిటని వారు ప్రకటించకపోయినా ఇదంతా కేంద్రం చలువతోనే అని బీజేపీ నేతలు క్రెడిట్ ను పంచుకుంటున్నారు.

టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నట్టు ఆసరా పింఛన్ల పథకం కలిసివస్తే గులాబీ పార్టీకి పెద్ద ప్రయోజనమే చేకూరుతుంది. అయితే ఇదే హామీని కాంగ్రెస్ అందిపుచ్చుకోవడంతో క్షేత్ర స్థాయిలో వారి అంచనాలు తలకిందులయ్యే అవకాశం లేకపోలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పింఛన్లు ఎత్తివేసే ప్రసక్తే లేదని తేలిపోయింది.. పైగా కాంగ్రెస్ నిరుద్యోగ భృతి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కేసీఆర్ సైతం రూ.3వేలు ప్రకటించేశారు.. ఇటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ మిగతా అంశాల్లో పార్టీపై వస్తున్న వ్యతిరేక పవనాలను అనుకూలంగా ఏవిధంగా మలుచుకుంటుందో వేచి చూడాల్సిందే.

First Published:  26 Oct 2018 1:50 AM IST
Next Story