రాఫెల్ కుంభకోణం ఎఫెక్ట్ తోనే సీబీఐలో దుమారం
దొరక్క దొరక్క రాఫెల్ అవినీతి కుంభకోణంలో దొరికిపోయిన మోడీని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని రాహుల్ డిసైడయ్యారు. రాఫెల్ కుంభకోణం ఎఫెక్ట్ తోనే సీబీఐలో దుమారం రేగిందని ఆయన ఆరోపించారు. తాజాగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కూడా రాహుల్ తీవ్రంగా వ్యతిరేకించారు. రాఫెల్ తీగలాగుతున్నందుకే అలోక్ వర్మను తొలగించారని సంచలన ఆరోపణలు చేశారు. రాఫెల్ కుంభకోణానికి అనుబంధంగా సీబీఐ లో అధికారుల మార్పులు జరిగాయని ఆరోపిస్తున్న రాహల్ తాజాగా మోడీని […]
దొరక్క దొరక్క రాఫెల్ అవినీతి కుంభకోణంలో దొరికిపోయిన మోడీని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని రాహుల్ డిసైడయ్యారు. రాఫెల్ కుంభకోణం ఎఫెక్ట్ తోనే సీబీఐలో దుమారం రేగిందని ఆయన ఆరోపించారు.
తాజాగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కూడా రాహుల్ తీవ్రంగా వ్యతిరేకించారు. రాఫెల్ తీగలాగుతున్నందుకే అలోక్ వర్మను తొలగించారని సంచలన ఆరోపణలు చేశారు. రాఫెల్ కుంభకోణానికి అనుబంధంగా సీబీఐ లో అధికారుల మార్పులు జరిగాయని ఆరోపిస్తున్న రాహల్ తాజాగా మోడీని ఎండగట్టే స్కెచ్ గీశారు.
శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రాహుల్ తో పాటు కాంగ్రెస్ సీనియర్లు ఆనంద్ శర్మ, వీరప్ప మెయిలీ, సీపీఐ నాయకులు డీ రాజా, శరద్ యాదవ్ కూడా ఈ నిరసనలో పాల్గొని కేంద్రానికి షాకిచ్చారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టాలని రాహుల్ పిలుపునిచ్చారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా రాహుల్ నిరసనకు మద్దతు తెలిపింది.
రాహుల్ సహా కాంగ్రెస్ సీనియర్లు, కార్యకర్తలు సీబీఐ కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో భారీగా బలగాలు, ఢిల్లీ పోలీసులను మోహరించారు. రాహుల్ పిలుపుతో బెంగళూరులో కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. చండీఘడ్ లో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు తీవ్ర తోపులాట జరిగింది.