Telugu Global
NEWS

జగన్‌పై ఆంధ్రజ్యోతి కథనం.... పోసాని ఫైర్‌

జగన్‌పై హత్యాయత్నాన్ని డ్రామాగా ఆంధ్రజ్యోతి పత్రిక అభివర్ణించడంపై దర్శకుడు పోసాని కృష్ణ మురళీ ఫైర్ అయ్యారు. పత్రికలో రాసిన వ్యాఖ్యలను చదివి వినిపించి మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణ పేపర్‌ను వన్‌సైడ్‌గా వాడడం ప్రజలందరికీ తెలుసని…. ఆ విషయం రాధాకృష్ణ మనస్సాక్షికీ తెలుసన్నారు. జగన్‌ ఒక్కడూ లేకుంటే చంద్రబాబే తిరిగి ముఖ్యమంత్రి అవుతారన్న ఉద్దేశంతో పదేపదే పనిగట్టుకుని ఆంధ్రజ్యోతి పత్రికలో కథనాలు రాస్తున్నారని విమర్శించారు. జగన్‌ ఆస్పత్రిలో ఉంటే డ్రామాలు కట్టిపెట్టండి అని ఆంధ్రజ్యోతి కథనం రాయడం నీచం […]

జగన్‌పై ఆంధ్రజ్యోతి కథనం.... పోసాని ఫైర్‌
X

జగన్‌పై హత్యాయత్నాన్ని డ్రామాగా ఆంధ్రజ్యోతి పత్రిక అభివర్ణించడంపై దర్శకుడు పోసాని కృష్ణ మురళీ ఫైర్ అయ్యారు. పత్రికలో రాసిన వ్యాఖ్యలను చదివి వినిపించి మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణ పేపర్‌ను వన్‌సైడ్‌గా వాడడం ప్రజలందరికీ తెలుసని…. ఆ విషయం రాధాకృష్ణ మనస్సాక్షికీ తెలుసన్నారు. జగన్‌ ఒక్కడూ లేకుంటే చంద్రబాబే తిరిగి ముఖ్యమంత్రి అవుతారన్న ఉద్దేశంతో పదేపదే పనిగట్టుకుని ఆంధ్రజ్యోతి పత్రికలో కథనాలు రాస్తున్నారని విమర్శించారు. జగన్‌ ఆస్పత్రిలో ఉంటే డ్రామాలు కట్టిపెట్టండి అని ఆంధ్రజ్యోతి కథనం రాయడం నీచం కాదా? అని ప్రశ్నించారు. ఆస్పత్రిలో సానుభూతి వచ్చేలా జగన్ పడుకున్నారని రాయడం ఏమిటన్నారు.

నిందితుడు జగన్‌ భుజం మీదే పొడవడానికి ప్రయత్నించాడని ఆంధ్రజ్యోతి ఎలా రాసిందని… రాధాకృష్ణకు ఎవరు చెప్పారని నిలదీశారు. జగన్‌ భుజం మీదే పొడవబోయాను అని నిందితుడు చెప్పాడా అని ప్రశ్నించారు. ”ఇంత దిగజారి ఆంధ్రజ్యోతిలో రాస్తారా… ఒకవేళ కత్తి మెడకు తగిలి జగన్‌ చనిపోయి ఉంటే … జగన్‌ సింపతీ కోసం తనను తాను పొడిపించుకున్నారు… కానీ దురదృష్టం కొద్ది కత్తి మెడకు తగిలి జగన్ చనిపోయాడు. డ్రామా జగన్‌ ప్రాణాలమీదకు వచ్చింది. అమ్మా జగన్‌ ఎంత డ్రామా ఆడావు. నీ చావుకే వచ్చిందే” అని రాధాకృష్ణ రాసేవాడన్నారు.

మనిషిగా పుట్టిన తర్వాత కొంతైనా విలువలు ఉండాలన్నారు. ”మీరు టీ కొట్టు పెట్టుకోలేదు … మీడియా అని సిగ్గులేకుండా చెప్పుకుంటూ ఇలా చంద్రబాబు కోసం దిగజారి రాస్తారా. చావు బతుకుల మధ్య ఒక వ్యక్తి ఉంటే డ్రామాలు అని రాసుకోవడం చూసి సిగ్గుపడుతున్నా. జగన్‌ చచ్చిపోలేదే అని మీడియా బాధపడుతోంది” అన్నారు.

మనిషన్న వాడు, కడుపుకు అన్నం తినేవాడు ఒక వ్యక్తి మీద దాడి జరిగి ఒక రోజు కూడా గడవకుండానే డ్రామాలు అని రాస్తాడా అని మండిపడ్డారు. జగన్‌ను చంపడానికే ప్లాన్‌ చేశారని.. కానీ అదృష్టం కొద్ది జగన్‌ బయటపడడంతో దాని నుంచి తప్పించుకునేందుకు లేనిపోని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

దాడి చేసిన వాడు ప్రొఫెషనల్‌….. కేవలం అదృష్టం కొద్ది జగన్‌ బయటపడ్డారన్నారు. జగన్‌ను పొడిచేందుకు వచ్చిన వాడు ఎవడైనా అలా పొడిస్తే సింపతీ వస్తుందనే చేశా అని తిరిగి ఒక లెటర్‌ రాసుకుని జేబులో పెట్టుకుంటారా అని పోసాని ప్రశ్నించారు. ఈ మాత్రం కూడా తెలియని అమాయకులు ప్రజలు అనుకుంటున్నారా అని నిలదీశారు.

ఒక అభిమాని సినిమా ప్లాఫ్ అయితే ఏడుస్తారే గానీ… వెళ్లి హీరోను కత్తితో పొడుస్తారా అని ప్రశ్నించారు. అలిపిరి దాడి కూడా చంద్రబాబే సానుభూతి కోసం చేయించుకున్నారంటే ఒప్పుకుంటారా అని మండిపడ్డారు. కానీ ఆ రోజు రాజకీయాల్లో విలువలున్న వ్యక్తులున్నారు కాబట్టే అలిపిరి ఘటనపై ఎవరూ ఇలా నీచంగా మాట్లాడలేదన్నారు.

విచారణ చేయకుండానే పబ్లిసిటీ కోసం చేశారని డీజీపీ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చెప్పి చంపుతారు…. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మేక వన్నె పులులు తిరుగుతున్నాయని మండిపడ్డారు. దాడి జరిగిన తర్వాత అక్కడ రచ్చ చేయకుండా హుందాగా జగన్‌ వెళ్లిపోయారని…. అదే చంద్రబాబు అయి ఉంటే రక్త కన్నీరు కార్చి సీన్‌ చేసేవారని ఎద్దేవా చేశారు.

అలిపిరిలో దాడి జరిగిన వెంటనే హైదరాబాద్‌ వచ్చి చంద్రబాబు చికిత్స చేయించుకుంటే తప్పు లేదు గానీ… యనమల రామకృష్ణుడు సింగపూర్ వెళ్లి పంటికి వైద్యం చేయించుకుంటే తప్పు లేదు గానీ…. జగన్‌ సేఫ్టీ కోసం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ వచ్చి చికిత్స చేయించుకుంటే అది తప్పు అని ఎలా అంటారని పోసాని ప్రశ్నించారు.

First Published:  26 Oct 2018 5:13 AM IST
Next Story