Telugu Global
Cinema & Entertainment

"ఆర్.ఆర్.ఆర్" కోసం భారీ పారితోషికం తీసుకోనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా లో నటిస్తున్న రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ కి భారిగా పారితోషకం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అది కూడా ఒక్కక్కరికి 30 కోట్ల నుండి 40 కోట్లు వచ్చేలా ఉన్నాయి అని టాక్. ఎన్టీఆర్, చరణ్ ఒక్కో సినిమాకు దాదాపు 20 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు రెగ్యులర్ […]

ఆర్.ఆర్.ఆర్ కోసం భారీ పారితోషికం తీసుకోనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా లో నటిస్తున్న రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ కి భారిగా పారితోషకం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అది కూడా ఒక్కక్కరికి 30 కోట్ల నుండి 40 కోట్లు వచ్చేలా ఉన్నాయి అని టాక్.

ఎన్టీఆర్, చరణ్ ఒక్కో సినిమాకు దాదాపు 20 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు రెగ్యులర్ గా చేసే సినిమాలకు వంద రోజుల వరకు డేట్స్ ఇస్తారు కానీ ఇది రాజమౌళి సినిమా కాబట్టి ఖచ్చితంగా 200 రోజుల కాల్ షీట్స్ కావాలని రాజమౌళి ముందే కండిషన్ పెట్టేసాడు. అంటే దాదాపు రెండు సినిమాల డేట్స్ అన్నమాట. అందుకే మినిమం ముప్పై కోట్లు మాగ్జిమం 40 కోట్లు వచ్చేలా లాభాల్లో వాటా ఇవ్వాలని నిర్ణయించునున్నారట నిర్మాతలు. నిర్మాత డి.వి.వి దానయ్య కూడా రాజమౌళితో మాట్లాడి ఈ విషయం సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ దానయ్య నిర్మాణంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

First Published:  26 Oct 2018 12:46 PM IST
Next Story