Telugu Global
National

ఓటుకు నోటు కేసు... సుప్రీం కోర్టు వద్ద ఏపీ పోలీసుల దౌర్జన్యం

సుప్రీం కోర్టు వద్ద ఏపీ పోలీసులు హల్‌చల్‌ చేశారు. ఓటుకు నోటు కేసు విచారణ సందర్బంగా తన తరపున తానే వాదించేందుకు నిందితుడు మత్తయ్య రాగా అతడిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. ఐడీ కార్డు లాగేసుకున్నారు. కోర్టులో ఐటమ్‌ నెంబర్ 35గా కేసు అంతలో విచారణ పూర్తయిపోయింది. విచారణకు మత్తయ్య రాకుండా ఉండేందుకు ఏపీ పోలీసులు ఇలా చేశారు. అయితే మత్తయ్య ఒక న్యాయవాది సాయంతో కోర్టులోకి వెళ్లి కోర్టు నెంబర్‌ […]

ఓటుకు నోటు కేసు... సుప్రీం కోర్టు వద్ద ఏపీ పోలీసుల దౌర్జన్యం
X

సుప్రీం కోర్టు వద్ద ఏపీ పోలీసులు హల్‌చల్‌ చేశారు. ఓటుకు నోటు కేసు విచారణ సందర్బంగా తన తరపున తానే వాదించేందుకు నిందితుడు మత్తయ్య రాగా అతడిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.

కోర్టు లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. ఐడీ కార్డు లాగేసుకున్నారు. కోర్టులో ఐటమ్‌ నెంబర్ 35గా కేసు అంతలో విచారణ పూర్తయిపోయింది. విచారణకు మత్తయ్య రాకుండా ఉండేందుకు ఏపీ పోలీసులు ఇలా చేశారు. అయితే మత్తయ్య ఒక న్యాయవాది సాయంతో కోర్టులోకి వెళ్లి కోర్టు నెంబర్‌ 5 ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.

పోలీసులు అడ్డుకున్న అంశాన్ని వెల్లడించారు. తానే సొంతంగా కేసును వాదించుకుంటానని చెప్పినా… ఏపీ పెద్దలే ఒక లాయర్‌ను నియమించి ఆ లాయర్ ద్వారా కేసును వాయిదా వేయించారని కోర్టుకు వివరించారు. తన ప్రమేయం లేకుండా తన తరపున హాజరైన లాయర్‌పైనా మత్తయ్య ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన న్యాయస్థానం మత్తయ్య అనుమతి లేకుండానే అతడి తరపున హాజరైన లాయర్‌ సుప్రియ జువేదను తమ ముందు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.

సుప్రియ జువేద పేరును సుప్రీం కోర్టు డిస్‌ప్లే బోర్డు మీద కూడా ఉంచారు. చంద్రబాబు చిక్కుకున్న ఓటుకు నోటు కేసులో మత్తయ్య స్వయంగా కోర్టుకు హాజరై నిజాలు చెబితే ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతోనే పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. అతడి ప్రమేయం లేకుండానే మరో లాయర్‌ను నియమించారు. సుప్రీం కోర్టు వద్ద ఈ వ్యవహారాన్ని ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు.

First Published:  26 Oct 2018 10:18 AM IST
Next Story