Telugu Global
Cinema & Entertainment

అర్జున్ రెడ్డి కాదు.. అతడి పేరు కబీర్ సింగ్

తెలుగు కల్ట్ క్లాసిక్ అర్జున్ రెడ్డి సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. తెలుగు వెర్షన్ ను డైరక్ట్ చేసిన సందీప్ రెడ్డే.. హిందీలో కూడా దర్శకుడు. ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా అర్జున్ రెడ్డి అనే టైటిల్ నే ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ ఆ టైటిల్ ను కొనసాగించడం లేదు. అంతా కలిసి కూర్చొని చర్చించి, ఈ సినిమాకు కబీర్ సింగ్ […]

అర్జున్ రెడ్డి కాదు.. అతడి పేరు కబీర్ సింగ్
X

తెలుగు కల్ట్ క్లాసిక్ అర్జున్ రెడ్డి సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. తెలుగు వెర్షన్ ను డైరక్ట్ చేసిన సందీప్ రెడ్డే.. హిందీలో కూడా దర్శకుడు. ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా అర్జున్ రెడ్డి అనే టైటిల్ నే ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ ఆ టైటిల్ ను కొనసాగించడం లేదు. అంతా కలిసి కూర్చొని చర్చించి, ఈ సినిమాకు కబీర్ సింగ్ అనే పేరుపెట్టారు.

అర్జున్ రెడ్డి సినిమాలో బెంగళూరు, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్స్ కనిపిస్తాయి. హిందీ వెర్షన్ లో ముంబయి, ఢిల్లీ బ్యాక్ డ్రాప్ సెటప్ చేశారు. అక్కడి నేటివిటీకి తగ్గట్టు ‘రెడ్డి’ బదులు సింగ్ అనే పదం చేరిస్తే బాగుంటుందని నిర్ణయించారు. ఎలాగూ టైటిల్ మారుస్తున్నాం కాబట్టి, అర్జున్ అనే పేరు తీసేసి మరింత నేటివిటీ టచ్ కోసం కబీర్ అనే పేరును తగిలించారు. అలా అర్జున్ రెడ్డి స్థానంలో కబీర్ సింగ్ వచ్చి చేరాడు.

ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ ఇప్పటికే దట్టంగా గడ్డం పెంచాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలోని కొన్ని లొకేషన్లలో జరుగుతోంది. అర్జున్ రెడ్డి టైపులో ఈ హిందీ రీమేక్ కు కూడా ఎలాంటి సెట్స్ వేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇందులో షాహిద్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  26 Oct 2018 11:18 AM IST
Next Story