సంచలన తీర్పు... 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దినకరన్ వర్గానికి భారీ షాక్ తగిలింది. పళని స్వామి ప్రభుత్వానికి ప్రమాదం తప్పింది. దినకరన్ వైపు నిలిచిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటును హైకోర్టు సమర్ధించింది. ఇది వరకే ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మిశ్రమ తీర్పును ఇచ్చింది. దీంతో కేసు మూడో న్యాయమూర్తి వద్దకు వెళ్లింది. విచారణ జరిపిన న్యాయమూర్తి…. 18 మంది దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు […]
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దినకరన్ వర్గానికి భారీ షాక్ తగిలింది. పళని స్వామి ప్రభుత్వానికి ప్రమాదం తప్పింది. దినకరన్ వైపు నిలిచిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటును హైకోర్టు సమర్ధించింది.
ఇది వరకే ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మిశ్రమ తీర్పును ఇచ్చింది. దీంతో కేసు మూడో న్యాయమూర్తి వద్దకు వెళ్లింది. విచారణ జరిపిన న్యాయమూర్తి…. 18 మంది దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు సరైనదేనని తీర్పు చెప్పారు. 18 స్థానాలు ఖాళీ అయినట్టు ఇచ్చిన నోటిఫికేషన్‌ను కూడా సమర్ధించింది.
జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో సంక్షోభం ఏర్పడిన సమయంలో 18 మంది ఎమ్మెల్యేలు దినకరన్ వైపు వెళ్లారు. వారిపై స్పీకర్ వేటు వేయగా వారు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చెల్లదు అని తీర్పు ఇచ్చి ఉంటే వెంటనే పళని స్వామి ప్రభుత్వానికి ముప్పు ఏర్పడేది.