Telugu Global
NEWS

వైఎస్ జగన్‌ పై హత్యాయత్నం

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడి జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్టులోని విఐపీ లాంజ్‌లో జగన్‌ కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వచ్చి కత్తితో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. దాడి చేసిన వ్యక్తిని చందన శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడిలో జగన్‌ చేతికి గాయమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. జగన్‌ లాంజ్‌లో కూర్చుని ఉన్న సమయంలో వెనుక నుంచి […]

వైఎస్ జగన్‌ పై హత్యాయత్నం
X

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై దాడి జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్టులోని విఐపీ లాంజ్‌లో జగన్‌ కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వచ్చి కత్తితో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. దాడి చేసిన వ్యక్తిని చందన శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడిలో జగన్‌ చేతికి గాయమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

జగన్‌ లాంజ్‌లో కూర్చుని ఉన్న సమయంలో వెనుక నుంచి వచ్చిన శ్రీనివాస్‌ కత్తితో పొడిచారు. వెంటనే జగన్‌కు ప్రథమ చికిత్స చేశారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌ శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు గాను విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. హైదరాబాద్‌ వెళ్ళేందుకు లాంజ్‌లో ఎదురు చూస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.

మరికాసేపట్లలో విమానం ఎక్కేందుకు జగన్ వెళ్తుండడంతో భద్రతా సిబ్బంది కూడా వెంట లేరు. దీంతో శ్రీనివాస్‌ కత్తితో దాడికి తెగించారు. దాడి చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్టులోని హోటల్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. దాడికి కారణాలు ఏంటి అన్నదానిపై పోలీసులు విచారిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో అక్కడే మిథున్ రెడ్డి కూడా ఉన్నారు.

First Published:  25 Oct 2018 8:37 AM IST
Next Story