మన్నెం నాగేశ్వరరావుపై వరుసగా పిటిషన్లు
అవినీతి ఆరోపణలు ఉన్న మన్నెం నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించడంపై సుప్రీం కోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటికే న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా కామన్ కాజ్ అనే స్వచ్చంధ సంస్థ నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని సీబీఐ ఉన్నత పదవిలో ఎలా నియమిస్తారని ప్రశ్నించింది. డైరెక్టర్ అలోక్ వర్మను బలవంతంగా సెలవుపై పంపడం కూడా అక్రమమని కామన్ కాజ్ కోర్టు […]
అవినీతి ఆరోపణలు ఉన్న మన్నెం నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించడంపై సుప్రీం కోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటికే న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
తాజాగా కామన్ కాజ్ అనే స్వచ్చంధ సంస్థ నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని సీబీఐ ఉన్నత పదవిలో ఎలా నియమిస్తారని ప్రశ్నించింది.
డైరెక్టర్ అలోక్ వర్మను బలవంతంగా సెలవుపై పంపడం కూడా అక్రమమని కామన్ కాజ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. నాగేశ్వరరావుతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ అధికారులపై సిట్ చేత దర్యాప్తు చేయించాలని సుప్రీం కోర్టుకు కామన్ కాజ్ స్వచ్చంద సంస్థ విజ్ఞప్తి చేసింది.
ఇప్పటికే తీవ్ర అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించడాన్ని సవాల్ చేస్తూ ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.