డీజీపీ వ్యాఖ్యలపై భగ్గుమన్న వైసీపీ
జగన్పై దాడిని పబ్లిసిటీ కోసం చేసినదిగా డీజీపీ వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ భగ్గుమంది. డీజీపీ టీడీపీ కార్యకర్తలా మాట్లాడారని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. డీజీపీ వ్యాఖ్యలు ఈ సంఘటనను వక్రీకరించేలా ఉన్నాయని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డీజీపీ వెంటనే వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చులకన మాటలు మాట్లాడడం డీజీపీకి సరికాదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన వ్యక్తే ఇప్పుడు విశాఖ ఎయిర్పోర్టులో రెస్టారెంట్ నడుపుతున్నారని బొత్స చెప్పారు. అభిమాని అయితే […]
జగన్పై దాడిని పబ్లిసిటీ కోసం చేసినదిగా డీజీపీ వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ భగ్గుమంది. డీజీపీ టీడీపీ కార్యకర్తలా మాట్లాడారని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. డీజీపీ వ్యాఖ్యలు ఈ సంఘటనను వక్రీకరించేలా ఉన్నాయని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
డీజీపీ వెంటనే వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చులకన మాటలు మాట్లాడడం డీజీపీకి సరికాదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన వ్యక్తే ఇప్పుడు విశాఖ ఎయిర్పోర్టులో రెస్టారెంట్ నడుపుతున్నారని బొత్స చెప్పారు.
అభిమాని అయితే దండలేస్తారు గానీ కత్తులతో పొడుస్తారా అని ప్రశ్నించారు. అతడు ఎక్కడి వాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు వంటివి మాత్రం చెప్పకుండా దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అని డీజీపీ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఇదే అధికారులతో తాము గతంలో కలిసి పనిచేశామని.. కానీ ఎన్నడూ ఇలాంటి దిగజారుడు పరిస్థితి చూడలేదన్నారు. దాడి జరిగి ఇంత సేపు అవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని బొత్స నిలదీశారు. టీడీపీ కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందన్న అనుమానం కలుగుతోందన్నారు.