Telugu Global
NEWS

ఎన్నికలు తెచ్చిన తంటా.... జూన్ దాకా జనం గోడు పట్టించుకోరా?

ఎన్నికల సమయమిది. ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా ఆ పని మీదే ఉన్నారు. అధికారులకైతే తీరిక ఉండడం లేదు. మొన్నటి వరకూ కొత్త ఓటర్లను చేర్చే బాధ్యతల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలు…. ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలయ్యారు. దీంతో గ్రామాలు, పట్టణాల్లో సమస్యలన్నీ పేరుకుపోయాయి. తాజాగా ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ ప్రోగ్రాంలను జిల్లా కలెక్టర్లందరూ ఎన్నికలు ముగిసే దాకా రద్దు చేశారు. దీంతో ప్రజలు వేల వినతులు పట్టుకొని […]

ఎన్నికలు తెచ్చిన తంటా.... జూన్ దాకా జనం గోడు పట్టించుకోరా?
X

ఎన్నికల సమయమిది. ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా ఆ పని మీదే ఉన్నారు. అధికారులకైతే తీరిక ఉండడం లేదు. మొన్నటి వరకూ కొత్త ఓటర్లను చేర్చే బాధ్యతల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలు…. ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలయ్యారు. దీంతో గ్రామాలు, పట్టణాల్లో సమస్యలన్నీ పేరుకుపోయాయి.

తాజాగా ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ ప్రోగ్రాంలను జిల్లా కలెక్టర్లందరూ ఎన్నికలు ముగిసే దాకా రద్దు చేశారు. దీంతో ప్రజలు వేల వినతులు పట్టుకొని కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. కానీ అధికారులు మాత్రం ఎన్నికల బిజీలో పడి అస్సలు పట్టించుకోవడం లేదట.

ప్రస్తుతం ఆపద్ధర్మ పాలన నడుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం స్వయంగా అభివృద్ధి పనులు, నిధుల మంజూరు వంటి పనులు చేయడానికి వీల్లేదు. అధికారులు కూడా చేయలేకపోతున్నారు. దీంతో చిన్న చిన్న పనులు కూడా వాయిదాలు పడుతూ జనం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎవ్వరితో చెప్పిచ్చినా…. ఎంత మొత్తుకున్నా కూడా పనులు మాత్రం కావడం లేదట.

ప్రస్తుతం తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు. అవి ముగియగానే పార్లమెంటు ఎన్నికలు.. ఇలా వచ్చే ఆరేడు నెలలు కూడా ఈ అరకొర అధికారులంతా అదే పనుల్లో ఉంటారు. దీంతో ప్రజల అవసరాలన్నీ పడకేయడం ఖాయంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలతోపాటైతే అప్పుడే రెండు మూడు నెలల్లో ముగిసిపోయేది. ప్రస్తుతం ముందస్తు ఎన్నికలతోపాటు పంచాయతీ, ఆ తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో ఏ అభివృద్ధి పనులు చేయడానికి వీల్లేదు. నిధులు విడుదల కావు. వచ్చే జూన్ వరకూ ప్రజా పాలన ముందుకు సాగడం కష్టం. సమస్యలున్న ప్రజల ఆర్తనాదాలు వినేవారే కరువు. ఎన్నికలు తెచ్చిన తంటాతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.

First Published:  24 Oct 2018 5:20 AM IST
Next Story