Telugu Global
National

సీబీఐ కొత్త డైరెక్టర్‌ నాగేశ్వర రావుపై తీవ్ర అవినీతి ఆరోపణలు.... పిటిషన్‌ దాఖలు

సీబీఐలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గంట గంటకు పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటి వరకు డైరెక్టర్‌, స్పెషల్ డైరెక్టర్లుగా ఉన్న అధికారులను సెలవుపై పంపిన కేంద్ర ప్రభుత్వం… సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించింది. తక్షణం విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించగా ఆయన వెంటనే చార్జ్ తీసుకున్నారు. తమను బలవంతంగా సెలవుపై పంపడాన్ని చాలెంజ్‌ చేస్తే సీబీఐ ఇప్పటి డైరెక్టర్‌గా ఉన్న అలోక్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలోక్ వర్మ తరపున ప్రశాంతభూషణ్ పిటిషన్ వేశారు. అదే […]

సీబీఐ కొత్త డైరెక్టర్‌ నాగేశ్వర రావుపై తీవ్ర అవినీతి ఆరోపణలు.... పిటిషన్‌ దాఖలు
X

సీబీఐలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గంట గంటకు పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటి వరకు డైరెక్టర్‌, స్పెషల్ డైరెక్టర్లుగా ఉన్న అధికారులను సెలవుపై పంపిన కేంద్ర ప్రభుత్వం… సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించింది.

తక్షణం విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించగా ఆయన వెంటనే చార్జ్ తీసుకున్నారు. తమను బలవంతంగా సెలవుపై పంపడాన్ని చాలెంజ్‌ చేస్తే సీబీఐ ఇప్పటి డైరెక్టర్‌గా ఉన్న అలోక్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలోక్ వర్మ తరపున ప్రశాంతభూషణ్ పిటిషన్ వేశారు. అదే సమయంలో మన్నెం నాగేశ్వరరావును తాత్కాలిక సీబీఐ డైరెక్టర్‌గా నియమించడంపైనా న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీవ్ర అభ్యంతరం, ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మన్నెం నాగేశ్వరరావు ఒడిషా, చత్తీస్‌గఢ్‌లో పనిచేసిన సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అందులో కొన్ని సంచలనం సృష్టించిన కుంభకోణాలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని సీబీఐ డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాను కాపాడుకునేందుకే కేంద్రం… అలోక్‌ వర్మను తొలగించిందని భూషణ్ ఆరోపించారు. మన్నెం నాగేశ్వరరావుపై అనేక కేసులున్నాయని వివరించారు.

ఇప్పటివరకు జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావును తొలగించాలని అలోక్‌ వర్మ గతంలో సిఫార్సు కూడా చేశారని ప్రశాంత్ భూషణ్ వెల్లడించారు. నాగేశ్వరరావుపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒక డాక్యుమెంటెండ్ స్టోరీని కూడా ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఇలాంటి అధికారిని సీబీఐ డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.

మొత్తం మీద మన్నెం నాగేశ్వరరావు నియమితులైన వెంటనే ఒక్కసారి అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో సీబీఐలో మరోసారి కలకలం రేగింది.

First Published:  24 Oct 2018 6:53 AM IST
Next Story