క్రికెటర్ల మీద కన్నేసిన కమలం పార్టీ!
వచ్చే ఎన్నికల్లో నెగ్గడానికి స్టార్‌లను, సెలబ్రిటీలను నమ్ముకుంటున్నట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం అధికారం ఉన్న నేపథ్యంలో ఇదే ఊపులో కొంతమంది సెలబ్రిటీలను పార్టీకి సానుభూతిపరులుగా చేసుకోవడానికి, కొందరిని డైరెక్టుగా బరిలోకి దింపడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు స్టార్ క్రికెటర్లకు బీజేపీ వల వేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారిలో ఒకరు ప్రస్తుతం టీమిండియాలో సభ్యుడిగా సాగుతున్న మాజీ కెప్టెన్ ధోనీ కాగా, మరొకరు ఢిల్లీ ఆటగాడు గౌతమ్ గంభీర్. వీరిద్దరికి మంచి ఫ్యాన్ […]
వచ్చే ఎన్నికల్లో నెగ్గడానికి స్టార్‌లను, సెలబ్రిటీలను నమ్ముకుంటున్నట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం అధికారం ఉన్న నేపథ్యంలో ఇదే ఊపులో కొంతమంది సెలబ్రిటీలను పార్టీకి సానుభూతిపరులుగా చేసుకోవడానికి, కొందరిని డైరెక్టుగా బరిలోకి దింపడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు స్టార్ క్రికెటర్లకు బీజేపీ వల వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
వారిలో ఒకరు ప్రస్తుతం టీమిండియాలో సభ్యుడిగా సాగుతున్న మాజీ కెప్టెన్ ధోనీ కాగా, మరొకరు ఢిల్లీ ఆటగాడు గౌతమ్ గంభీర్. వీరిద్దరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులోనూ క్రికెటర్లు అంటే వారికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది.
ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి స్టార్ క్రికెటర్లు తమ పార్టీలోకి చేరితే బాగుంటుందనేది బీజేపీ లెక్కగా తెలుస్తోంది. ఈ మేరకు సంప్రందింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
అన్నీ కుదిరితే వచ్చే ఎన్నికల్లో ధోనీ జార్ఖండ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తాడని, ఢిల్లీ నుంచి గౌతమ్ గంభీర్ రంగంలోకి దిగుతాడని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
ధోనీ రాంచీలో పోటీ చేస్తే అతడు ఎంపీగా నెగ్గడం ఏ మాత్రం కష్టం కాదు. అలాగే గంభీర్ కూడా తరచూ సామాజిక అంశాలపై ఘాటుగా స్పందిస్తూ ఉంటాడు. సైన్యానికి గొప్ప మద్దతు దారుడిగా ఉంటాడు. పాకిస్తాన్ చేష్టల మీద కూడా వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ ఉంటాడు. కాబట్టి ఇతడికీ సామాన్యుల్లో మంచి పాలోయింగ్ ఉందని బీజేపీ అంచనా వేస్తోంది.
వీరిని చేర్చుకోవడం ద్వారా రెండు సీట్లకు మంచి అభ్యర్థులను సంపాదించుకోవడంతో పాటు వీరి స్టార్ డమ్ ను బీజేపీ కోసం దేశ వ్యాప్తంగా వాడుకోవచ్చనే లెక్కలు వేస్తున్నారు కమలనాథులు. అయితే దీనికి ధోనీ, గంభీర్ లు ఓకే అంటారా? అనేది మాత్రం ప్రస్తుతానికి కొశ్చన్ మార్కే!