కాంగ్రెస్‌లో వినోద్ చేరిక ఆగిపోయిందా?
టీఆర్ఎస్ నేత, కాకా వారసుడు గడ్డం వినోద్ కుమార్ కాంగ్రెస్‌లో చేరతారని ఇటీవల ప్రచారం జరిగింది. చెన్నూరులో జరిగిన అనుచరుల మీటింగ్‌లో కూడా వినోద్ ఇవే సంకేతాలు పంపించారు. అయితే రాహుల్ సభలో వినోద్ చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. తీరా చూస్తే భైంసా, కామారెడ్డిలో జరిగిన సభలో వినోద్ కాంగ్రెస్‌లో చేరలేదు. దీంతో వినోద్ చేరిక ఆగిపోవడానికి కారణాలేంటి? అనే చర్చ కాంగ్రెస్‌లో నడుస్తోంది. కాకా వారసుడి చేరికకు కాంగ్రెస్ నేతలు అడ్డుపుల్ల వేసినట్లు తెలుస్తోంది. […]
టీఆర్ఎస్ నేత, కాకా వారసుడు గడ్డం వినోద్ కుమార్ కాంగ్రెస్‌లో చేరతారని ఇటీవల ప్రచారం జరిగింది. చెన్నూరులో జరిగిన అనుచరుల మీటింగ్‌లో కూడా వినోద్ ఇవే సంకేతాలు పంపించారు. అయితే రాహుల్ సభలో వినోద్ చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. తీరా చూస్తే భైంసా, కామారెడ్డిలో జరిగిన సభలో వినోద్ కాంగ్రెస్‌లో చేరలేదు. దీంతో వినోద్ చేరిక ఆగిపోవడానికి కారణాలేంటి? అనే చర్చ కాంగ్రెస్‌లో నడుస్తోంది.
కాకా వారసుడి చేరికకు కాంగ్రెస్ నేతలు అడ్డుపుల్ల వేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లో టికెట్ రాలేదన్న కారణంతో వినోద్ ఒక్కరే కాంగ్రెస్‌లోకి వస్తే ఒప్పుకునేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పినట్లు సమాచారం. తమ్ముడు వివేక్‌తో కలిసి వస్తేనే కాంగ్రెస్‌లో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌పై కొందరు నేతలు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి కూడా వీరి రాకను అడ్డుపడుతున్నట్లు వినోద్ సన్నిహితులు చెబుతున్నారు.
మరోవైపు వినోద్, వివేక్ వస్తే తన సీటుకు ఎసరు వస్తుందని భావించిన కాంగ్రెస్ నేత ఒకరు ఈ మెలికపెట్టినట్లు కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. వివేక్ మాత్రం టీఆర్ఎస్ వీడి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు ఈ ఇద్దరు బ్రదర్స్ టీఆర్ఎస్‌లో చేరారు. ఆతర్వాత ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఎన్నికల తర్వాత మళ్ళీ గులాబీ గూటికి చేరారు. దీంతో మళ్లీ పార్టీ మారితే జనాలు నవ్వుకుంటారని వివేక్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తారని… తొందరపడొద్దని అన్నను కోరుతున్నట్లు తెలుస్తోంది.
వినోద్ కాంగ్రెస్‌లో చేరినా సీటు డౌటేనని ఆ పార్టీ జిల్లా నేతలు చెబుతున్నారు. చెన్నూరు సీటు బోర్లకుంట వెంకటేష్‌కు ఇస్తున్నట్లు సమాచారం. కొప్పుల రాజు అండతో వెంకటేష్ టిక్కెట్ తనకు వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. రేవంత్ వర్గానికి చెందిన బోడ జనార్దన్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. బెల్లంపల్లి సీటును గద్దర్ కొడుకు సూర్యకిరణ్‌కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి డౌట్…. చెన్నూరు రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో వినోద్ కాంగ్రెస్‌లో చేరినా మంచిర్యాల జిల్లాలో ఆయనకు సీటు కష్టమేనని అంటున్నారు.