మోడీ టార్గెట్ గా.... ఏపీ ఉద్యోగుల సీపీఎస్ పోరు.... బాబు ప్లానేనా?
సీపీఎస్…. కాంట్రీ బ్యూటరీ పెన్షన్ స్కీమ్…. కొన్నేళ్ల క్రితం వరకూ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యాక వారి బేసిక్ ను బట్టి వారికి నెలవారీగా పింఛన్ అందేది. కానీ 2004లో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఈ పింఛన్ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగి పనిచేసినప్పుడు జీతాల్లోంచి కట్ చేసి రిటైర్ మెంట్ రోజు కొంత చేతిలో పెట్టి దులుపుకునేలా సీపీఎస్ వ్యవస్థను తెచ్చారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులందరూ ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా గుంటూరులో ఏపీ […]
సీపీఎస్…. కాంట్రీ బ్యూటరీ పెన్షన్ స్కీమ్…. కొన్నేళ్ల క్రితం వరకూ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యాక వారి బేసిక్ ను బట్టి వారికి నెలవారీగా పింఛన్ అందేది. కానీ 2004లో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఈ పింఛన్ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగి పనిచేసినప్పుడు జీతాల్లోంచి కట్ చేసి రిటైర్ మెంట్ రోజు కొంత చేతిలో పెట్టి దులుపుకునేలా సీపీఎస్ వ్యవస్థను తెచ్చారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులందరూ ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా గుంటూరులో ఏపీ ఉద్యోగులంతా నిరసన సభకు మంగళవారం పూనుకున్నారు. ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నారు. నవంబర్ 15న ఉద్యోగుల సమ్మెకు పిలుపునిచ్చారు.
ఏపీ ఉద్యోగసంఘం నేత మురళీకృష్ణ మాట్లాడుతూ…. సీపీఎస్ పై తెలుగుదేశం పార్టీ హామీనిచ్చిందని…. ఆ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని…. కేంద్రం సీపీఎస్ అమలు చేయాలని కోరుతూ సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు. బాబును మాత్రం ఏం అనకుండా మోడీపైనే ఆయన విమర్శలు చేశారు. అయితే విశేషం ఏమిటంటే ఈ సీపీఎస్ స్కీమ్ ను తెచ్చింది వాజ్ పేయ్ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం. ఈ ఎన్డీయేలో చంద్రబాబు కూడా భాగస్వామి. అప్పుడు ఇదే సీపీఎస్ ను చంద్రబాబు స్వాగతించాడు కూడా. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు.
స్వతహాగా ప్రస్తుతం మోడీ వ్యతిరేక ప్రచారం, కుట్రలు, కుతంత్రాలు ఏపీ కేంద్రంగా జరుగుతున్నాయి. చంద్రబాబు కూడా ఎక్కడ కేంద్రం దొరుకుతుందా…. అక్కడ ఆ పార్టీని అభాసుపాలు చేద్దామని చూస్తున్నాడు. అందుకే తాజాగా సీపీఎస్ తో ఉద్యోగులను రెచ్చగొట్టి మోడీపై యుద్ధం ప్రకటించడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఏపీ ఉద్యోగ సంఘం నేత మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్ రద్దు కోసం నవంబర్ 15న సమ్మె చేస్తామని…. దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలను కలుపుకొని సీపీఎస్ కోసం ఢిల్లీలో ఆందోళన, సమ్మెకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. దీన్ని బట్టి ఏపీ కేంద్రంగా ఉద్యోగులు మరోసారి మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉండి ఉండవచ్చని బీజేపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.