లోకేష్ పనితీరుకు.... పవన్ బలానికి పరీక్ష
ఏపీలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేకాధికారుల పాలన చెల్లదంటూ జీవో 90ని కొట్టివేసింది. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లని పక్షంలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్ ఎన్నికలు పరోక్ష పద్దతిలో జరిగినా ఎవరు ఏ పార్టీ అభ్యర్థి అన్నది అందరికీ తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్లను సాకుగా ప్రభుత్వం చూపుతున్నా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయన్నది అధికార పార్టీ అభిప్రాయం. […]
ఏపీలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేకాధికారుల పాలన చెల్లదంటూ జీవో 90ని కొట్టివేసింది. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లని పక్షంలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.
సర్పంచ్ ఎన్నికలు పరోక్ష పద్దతిలో జరిగినా ఎవరు ఏ పార్టీ అభ్యర్థి అన్నది అందరికీ తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్లను సాకుగా ప్రభుత్వం చూపుతున్నా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయన్నది అధికార పార్టీ అభిప్రాయం.
పైగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు తేడాగా వస్తే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు నారా లోకేష్ భవిష్యత్తును ఒత్తిడికి గురి చేస్తాయి. పైగా చంద్రబాబు ప్రభుత్వంపై గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నది సర్వేలు చెబుతున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో సాధారణంగానే అధికార పార్టీకి కొద్దిమేర మొగ్గు ఉంటుంది. పైగా టీడీపీకి కేడర్ కూడా ఉంది. ఈ సానుకూల అంశాల మధ్య టీడీపీ ఆధిక్యం చూపగలిగితే సరే. లేకుంటే ఆపార్టీకి తీవ్ర నష్టం తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు వెనుకబడ్డా… చెప్పుకోవడానికి కారణాలు వారికి ఉంటాయి. కానీ అధికార పార్టీ ఓడితే ప్రభుత్వమే విఫలమైనట్టు భావించే అవకాశం ఉంది.
ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు వస్తే జనసేనకు కూడా పెద్ద సవాలే. ఎందుకంటే ఇప్పటి వరకు జనసేన పార్టీ నిర్మాణమే జరగలేదు. జనసేన కార్యక్రమాలన్నీ కేవలం గోదావరి జిల్లాలకే పరిమితమయ్యాయన్న అభిప్రాయం ఉంది.
జనసేన కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే ప్రభావితం చూపి ఇతర జిల్లాల్లో చతికిల పడితే…. ఇక ఆ పార్టీ కొన్ని జిల్లాలకే పరిమతమైపోయే చాన్స్ ఉంది. మరో విషయం ఏమిటంటే ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ప్రజల్లో తన బలమెంత అన్నది ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు.
దాంతో పవన్ కల్యాణ్ తనకు అంత బలం ఉంది… ఇంత బలం ఉంది…. అని గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే గోదావరి జిల్లాల్లో మినహా మిగిలిన చోట్ల ప్రభావం చూపడం కష్టమే.
ఒకవేళ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయం అని ప్రకటించే వీలు కూడా జనసేనకు లేదు. ఎందుకంటే ఇటీవలే ఆయన పలు బహిరంగ సభల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టండి జనసేన సత్తా ఏంటో చూపిస్తాం అని ప్రభుత్వానికి సవాల్ చేశారు.
- andhra pradesh grama panchayat electionsAPNRC CEO vemuri ravi kumarchandrababu naidu lokesh land dealingschandrababu naidu lokesh scamchandrababu naidu lokesh scam high court Philganneru pappu lokeshHigh Courthigh court PhilIT companies land dealingsIT companies land dealings andhra pradeshJanaSenajanasena kapusenaJanasena Partykalyan janasenakapusenakonidela pawankalyanland dealingslokeshlokesh comedylokesh ganneru pappulokesh ministrylokesh pappulokesh politicslokesh scamlokesh scamslokesh speecheslokesh tongue slipminister lokeshminister nara lokeshmlc lokeshmlc nara lokeshNara Lokeshnara lokesh IT companies land dealingsnara lokesh scamsnara lokesh staminanara pappupappu lokeshpappu naidupawanpawan janasenaPawan Kalyanpawan kalyan childrenspawan kalyan familypawan kalyan janasenapawan kalyan janasena partypawan kalyan kapu meetingpawan kalyan staminapawan kalyan wifepawan kalyan wifesPawankalyanpawankalyan fanpawankalyan fanspawankalyan fans clubpawankalyan fcpawankalyan instagramPKpowerstar fanpowerstar fan ikkadapowerstar fanspowerstar fans clubpowerstar fcpspkpspk addictpspk fanpspk fanspspk fcpspkfan sclubrenudesaistaminatongue sliptongue slip lokeshvemuri ravi kumar nara lokeshvemuri ravi kumar nara lokesh IT companies scam