ఇదంతా కాంగ్రెస్ కోవర్టుల ప్రచారమే...
తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్ అధికారంలోకి రావాలని కొందరు కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. అలాంటి వారు కాంగ్రెస్‌లో కోవర్టులుగా పనిచేస్తున్నారన్నారు. కోదండరాంతో కొందరు పనిగట్టుకుని పార్టీ పెట్టించారన్నారు. పార్టీ పెట్టడం ఆయనకు ఇష్టం లేదన్నారు. కోదండరాంను తాము తక్కువ చేసి చూడడం లేదని.. కానీ కొందరు కోదండరాంను కాంగ్రెస్ అవమానిస్తోందని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్‌మోహన్ రెడ్డి […]
తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్ అధికారంలోకి రావాలని కొందరు కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. అలాంటి వారు కాంగ్రెస్‌లో కోవర్టులుగా పనిచేస్తున్నారన్నారు.
కోదండరాంతో కొందరు పనిగట్టుకుని పార్టీ పెట్టించారన్నారు. పార్టీ పెట్టడం ఆయనకు ఇష్టం లేదన్నారు. కోదండరాంను తాము తక్కువ చేసి చూడడం లేదని.. కానీ కొందరు కోదండరాంను కాంగ్రెస్ అవమానిస్తోందని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని కొందరు కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారన్నారు. వారే పార్టీలోని వ్యవహారాలను లీక్ చేస్తూ… కోదండరాంను కాంగ్రెస్‌కు దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
పవన్ కల్యాణ్‌ను ఆంధ్రాలో చూసుకోవాల్సిందిగా చెప్పానన్నారు. పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి కేసీఆర్‌కు మంచి జరుగుతుందన్నారు. వ్యక్తిగతంగానూ తాను పవన్ కల్యాణ్‌కు ఈ విషయం చెప్పానన్నారు. రైతు బంధు పథకం కేవలం భూస్వాములకు మేలు చేసేదే అని ఆరోపించారు. కేసీఆర్‌ది ఇంటి పార్టీ కాబట్టి వెంటనే అభ్యర్థులను ప్రకటించగలిగారని.. కానీ తమ పార్టీ అలా కాదన్నారు ఒక ఇంటర్వ్యూలో వీహెచ్.