Telugu Global
NEWS

ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌పై రేప్‌ కేసు నమోదు

కేరళ మాజీ సీఎం, ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఉమెన్ చాందీకి ఉచ్చు బిగుసుకుంటోంది. కేరళలో ప్రకంపనలు సృష్టించిన సోలార్ స్కాంలో నిందితురాలు సరితా నాయర్‌ ఫిర్యాదుతో ఉమెన్ చాందీపై అత్యాచారం కేసు నమోదు అయింది. తనను ఉమెన్ చాందీతో పాటు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రేప్‌ చేశారని ఆమె కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమెన్‌ చాందీ ఆయన అధికార నివాసంలోనే అత్యాచారం చేయగా… కేసీ వేణుగోపాల్ నాటి మంత్రి అనిల్ కుమార్ […]

ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌పై రేప్‌ కేసు నమోదు
X

కేరళ మాజీ సీఎం, ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఉమెన్ చాందీకి ఉచ్చు బిగుసుకుంటోంది. కేరళలో ప్రకంపనలు సృష్టించిన సోలార్ స్కాంలో నిందితురాలు సరితా నాయర్‌ ఫిర్యాదుతో ఉమెన్ చాందీపై అత్యాచారం కేసు నమోదు అయింది.

తనను ఉమెన్ చాందీతో పాటు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ రేప్‌ చేశారని ఆమె కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమెన్‌ చాందీ ఆయన అధికార నివాసంలోనే అత్యాచారం చేయగా… కేసీ వేణుగోపాల్ నాటి మంత్రి అనిల్ కుమార్ ఇంట్లో తనపై లైంగిక దాడి చేశారని ఆమె వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే సరిత ఆరోపణలను ఉమెన్ చాందీ కొట్టిపారేశారు. శబరిమల వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే తనపై కేరళ ప్రభుత్వం కక్ష కట్టి కేసులు పెట్టించిందని ఆరోపించారు. న్యాయపరంగానే దీన్ని ఎదుర్కొంటానన్నారు.

First Published:  22 Oct 2018 4:25 AM IST
Next Story