తుఫాను ప్రాంత పర్యటనపై జగన్ ఆలోచన
శ్రీకాకుళం జిల్లా తుపాను చిక్కుకుంటే జగన్ ఎందుకు పరామర్శకు రావడం లేదని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎక్కడ ఎవరికి ప్రమాదం జరిగినా,ఎవరికి ఆపద వచ్చినా వెంటనే పరామర్శలకు వెళ్లే జగన్ .. శ్రీకాకుళం తుపాను ప్రాంతానికి వెళ్లకపోవడం ఆ పార్టీ శ్రేణులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. తుపాను ప్రాంతంలో నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధితులను కలిసేందుకు రెండు కమిటీలను జగన్ వేశారు. ప్రస్తుతానికి ఆ రెండు కమిటీలు తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి. నిజానికి జగన్ … […]
శ్రీకాకుళం జిల్లా తుపాను చిక్కుకుంటే జగన్ ఎందుకు పరామర్శకు రావడం లేదని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎక్కడ ఎవరికి ప్రమాదం జరిగినా,ఎవరికి ఆపద వచ్చినా వెంటనే పరామర్శలకు వెళ్లే జగన్ .. శ్రీకాకుళం తుపాను ప్రాంతానికి వెళ్లకపోవడం ఆ పార్టీ శ్రేణులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. తుపాను ప్రాంతంలో నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధితులను కలిసేందుకు రెండు కమిటీలను జగన్ వేశారు. ప్రస్తుతానికి ఆ రెండు కమిటీలు తుపాను ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి.
నిజానికి జగన్ … ఇప్పటికిప్పుడు తుపాను ప్రాంతంలో పర్యటించకపోవడం ఒక విధంగా చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే పరిణామమే. తుపాను బాధితులకు మంచి చేసేదే. ఎందుకంటే జగన్ కూడా ఇప్పుడే తుపాను ప్రాంతాల్లో పర్యటించి వచ్చి ఉంటే హుద్‌హుద్ తరహాలోనే తిత్లీ తాటా తీసేశా… అక్కడి ప్రజలను కష్టాలను ఒడ్డుకు పడేశా అని ప్రకటించేసి చంద్రబాబు అమరావతికి వచ్చేసేవారు.
ఆ తర్వాత అక్కడి పరిస్థితిపై పెద్దగా చర్చకు అవకాశం ఉండేది కాదు. కానీ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ ఆలోచనను పరోక్షంగా బయటపెట్టారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ మరో 15 రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలోకి ఎంటరవుతారు. ఆ సమయంలో తుపానుకు దెబ్బతిన్న ప్రతిగ్రామంలోనూ జగన్ పర్యటిస్తారని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
అదే జరిగితే 15 రోజుల తర్వాత తుపాను ప్రాంతం ఎలా ఉందన్న దానిపై మరోసారి చర్చ జరుగుతుంది. బాధితులకు నష్టపరిహారం అందిందా.. వారి జీవనం సాధారణ స్థాయికి చేరిందా అన్నది చర్చకు వస్తుంది. గతంలో హుద్‌హుద్ సమయంలో చంద్రబాబు వారం పాటు అక్కడ తిరిగి ఆ తర్వాత హుద్‌హుద్‌ను గెలిచామని వెనక్కు వచ్చారు.
కానీ ఇప్పటికీ హుద్‌హుద్ వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం అందలేదు. కానీ 15 రోజుల తర్వాత జగన్ తుపాను బాధిత ప్రతి గ్రామాన్ని సందర్శిస్తారని తెలిసిన తర్వాత ప్రభుత్వం ఇంకాస్త జాగ్రత్తగానే సహాయక చర్యలు, నష్టపరిహారం చెల్లింపులో పనిచేస్తుంది.