Telugu Global
NEWS

తెలంగాణలో తేలని కూటమి లెక్కలు.. ఏం జరుగుతోంది?

తెలంగాణలో ఏర్పాటు చేయదలిచిన మహాకూటమి లెక్కలు ఇంకా తేలడం లేదు. ఈ విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి అంటున్నాడు కాంగ్రెస్ నేత జానా రెడ్డి. విశేషం ఏమిటంటే ఈ కూటమి ప్రతిపాదన వచ్చినప్పుడు ఎక్కడ ఉందో, ఇప్పుడు కూడా అక్కడే ఉంది. సీట్ల లెక్కల విషయంలో ఎవరి లెక్కలు వారివిగానే ఉన్నాయి. ఇవి ఎంతకూ తేలడం లేదు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించుకుని దూసుకుపోతుంటే..ఈ కూటమి మాత్రం ఇంకా సీట్ల లెక్కలు వేసుకోవడంలోనే ఉంది. […]

తెలంగాణలో తేలని కూటమి లెక్కలు.. ఏం జరుగుతోంది?
X

తెలంగాణలో ఏర్పాటు చేయదలిచిన మహాకూటమి లెక్కలు ఇంకా తేలడం లేదు. ఈ విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి అంటున్నాడు కాంగ్రెస్ నేత జానా రెడ్డి. విశేషం ఏమిటంటే ఈ కూటమి ప్రతిపాదన వచ్చినప్పుడు ఎక్కడ ఉందో, ఇప్పుడు కూడా అక్కడే ఉంది. సీట్ల లెక్కల విషయంలో ఎవరి లెక్కలు వారివిగానే ఉన్నాయి. ఇవి ఎంతకూ తేలడం లేదు.

ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించుకుని దూసుకుపోతుంటే..ఈ కూటమి మాత్రం ఇంకా సీట్ల లెక్కలు వేసుకోవడంలోనే ఉంది. ఇవి కూడా ఇప్పుడప్పుడే తేలేలా కనిపించడం లేదు.

త్వరలోనే తేలిపోతాయని అంటున్నాడు జానారెడ్డి. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. తెలంగాణలో మహాకూటమి విజయావకాశాలు అన్నీ కూటమి సీట్ల లెక్క తేలాకే నిర్దేశం అవుతాయి.

ఎందుకంటే.. కాంగ్రెస్ , తెలుగుదేశం, టీజేఎస్, కమ్యూనిస్టులు కలిస్తే బలంగానే ఉంటాయి. అయితే.. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు…అక్కడ ఎవరు అసహనభరితులు అవుతారు, ఎక్కడ రెబల్స్ లేస్తారు.. అనేదాన్ని బట్టే పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

కాంగ్రెస్ కు బలం ఉన్న చోట టీడీపీ అభ్యర్థి వచ్చి పోటీ చేస్తే అక్కడా అంతే సంగతులు. అలాగే టీడీపీకి ఎంతో కొంత ఊపు ఉన్న చోట కాంగ్రెస్ అభ్యర్థి రంగంలోకి దిగితే శ్రేణులు సహకరిస్తాయనే నమ్మకాలు లేవు. అలాగే టీజేఎస్, కమ్యూనిస్టులకు కూడా కాంగ్రెస్, టీడీపీ వర్గాలు పూర్తిగా సపోర్ట్ చేస్తాయని చెప్పడానికి లేదు. వీళ్లు కలిస్తే ఎంత బలవంతం అవుతారో.. అంతే స్థాయిలో శ్రేణులు విడిపోయి ఒకరికొకరు సహకరించుకోకపో అంతే స్థాయిలో బలహీనం అవుతారు కూడా.

ఇక ఎన్నికల సమయంల దగ్గరపడుతున్న కూటమి లెక్కలు తేలడం లేదు. ఇవి తేలితే కానీ పొలిటికల్ పిక్చర్ ఒక క్లారిటీకి రాదు. తేల్చేస్తాం.. అంటూ పొద్దుపుచ్చుతున్నాడు జానా రెడ్డి. ఇదీ తెలంగాణ రాజకీయ స్థితి ఇప్పుడు.

First Published:  20 Oct 2018 5:47 AM IST
Next Story