ఎన్టీఆర్ బయోపిక్‌కు వర్మ చాలెంజ్
ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలపై తీయబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పనులను వర్మ వేగవంతం చేశారు. జనవరి 24న సినిమా విడుదలవుతుందని ప్రకటించారు. ఆశ్చర్యంగా హేతువాది అయిన రాంగోపాల్ వర్మ తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న కాణిపాకంలో ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీపార్వతితో పాటు తిరుమల స్వామిని దర్శించుకున్న వర్మ… ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందన్నది ఈ భగవంతుడికి అంతా తెలుసని.. కాబట్టి తన సినిమాలో ఆ నిజాలు చూపించే శక్తి ఇవ్వాల్సిందిగా స్వామిని కోరుకున్నానని చెప్పారు. దేవుడిని […]
ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలపై తీయబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పనులను వర్మ వేగవంతం చేశారు. జనవరి 24న సినిమా విడుదలవుతుందని ప్రకటించారు. ఆశ్చర్యంగా హేతువాది అయిన రాంగోపాల్ వర్మ తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.
నిన్న కాణిపాకంలో ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీపార్వతితో పాటు తిరుమల స్వామిని దర్శించుకున్న వర్మ… ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందన్నది ఈ భగవంతుడికి అంతా తెలుసని.. కాబట్టి తన సినిమాలో ఆ నిజాలు చూపించే శక్తి ఇవ్వాల్సిందిగా స్వామిని కోరుకున్నానని చెప్పారు. దేవుడిని నమ్మే వచ్చానని వ్యాఖ్యానించారు.
అంతకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి వర్మ కొన్ని వివరాలను “ఏవీ” ద్వారా వివరించారు. ఎన్టీఆర్‌పై ఎవరూ సినిమాలు తీసినా ఎన్టీఆర్ ఆశీర్వాదం మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మాత్రమే ఉంటుందన్నారు. ఇది తన చాలెంజ్ అన్నారు వర్మ.
లక్ష్మీపార్వతి గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారని.. అలా చెప్పడం వెనుక వారి సొంత ఎజెండాలు ఉండవచ్చన్నారు. కానీ ఎన్టీఆర్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు… లక్ష్మీపార్వతి గురించి ఎనలేని గౌరవంతో మాట్లాడారని.. కాబట్టి లక్ష్మీపార్వతిని అవమానిస్తే ఎన్టీఆర్‌ను అవమానించినట్టే అవుతుందన్నారు వర్మ.
ఎన్టీఆర్ ఆఖరి రోజుల్లో ఆయన ఇంట్లో పనిచేసిన పనివాళ్లు, ఆఫీసర్లతో పాటు లక్ష్మీపార్వతి శత్రువులను కూడా ఇంటర్వ్యూ చేసి లోతుల్లో ఉన్న నిజాలు వెలికి తీసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా వెనుక రాజకీయ కారణాలు లేవని చెబితే ఎవరూ నమ్మరు కాబట్టి తాను అలా చెప్పబోనన్నారు. కానీ సినిమాలో మాత్రం కల్పితాలను చూపించనని ఎన్టీఆర్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని వర్మ వివరించారు.