Telugu Global
National

కాంగ్రెస్ పార్టీకి.... ఆ పార్టీతో కొత్త తలనొప్పి!

ప్రస్తుతం జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొద్దో గొప్పో ఛాన్స్ ఉన్నది రాజస్థాన్ లో మాత్రమే. ఈ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఖాయంగా గెలవగలదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సర్వేలు కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా పాత వచ్చని అధ్యయనాలు అంటున్నాయి. అయితే బీజేపీ మాత్రం విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరి పది రోజుల్లో పరిస్థితిని మొత్తం మార్చేస్తామనే కాన్పిడెన్స్ తో ఉంది కమలం […]

కాంగ్రెస్ పార్టీకి.... ఆ పార్టీతో కొత్త తలనొప్పి!
X

ప్రస్తుతం జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొద్దో గొప్పో ఛాన్స్ ఉన్నది రాజస్థాన్ లో మాత్రమే. ఈ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఖాయంగా గెలవగలదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సర్వేలు కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా పాత వచ్చని అధ్యయనాలు అంటున్నాయి. అయితే బీజేపీ మాత్రం విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరి పది రోజుల్లో పరిస్థితిని మొత్తం మార్చేస్తామనే కాన్పిడెన్స్ తో ఉంది కమలం పార్టీ.

ఇది వరకూ జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే జరిగింది. మొదట కాంగ్రెస్ ముందంజలో ఉందని వార్తలు రావడం చివరిలో మాత్రం బీజేపీ పై చేయి సాధించడం. ఇదే కథ. రాజస్థాన్ లో కూడా ఇదే జరగుతుందని బీజేపీ విశ్వాసంతో ఉంది.

ఆ సంగతలా ఉంటే.. ఆ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో తలనొప్పి పట్టుకుంది. అది బీఎస్పీ రూపంలో. ఇక్కడ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ సొంత పోరుకు సిద్ధం అవుతోంది. మొన్నటి వరకూ ఈ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నించింది కాంగ్రెస్. అయితే మాయావతి మాత్రం భారీగా సీట్లను డిమాండ్ చేసింది. దానికి కాంగ్రెస్ నో చెప్పింది. ఫలితంగా.. బీఎస్పీ సొంతంగా బరిలోకి దిగుతోంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ రాజస్థాన్ లో ఓడటానికి కారణం ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో ఓటమి పాలవ్వడమే. ఈ సీట్లలో బీఎస్పీకి మంచి పట్టుంది. ముప్పైకి పైగా ఇలాంటి స్థానాలున్నాయి. వాటిల్లో బీఎస్పీ నెగ్గకున్నా.. కాంగ్రెస్ ను దెబ్బతీయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. గెలవడానికి అంతో ఇంతో ఛాన్స్ ఉందన్న రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఇలా బీఎస్పీ రూపంలో తలనొప్పి ఎదురవుతోంది.

First Published:  18 Oct 2018 11:24 PM GMT
Next Story