50 కోట్లు వెంట్రుకతో సమానమన్న వైసీపీ ఎమ్మెల్యే
మరో వైసీపీ ఎమ్మెల్యే తనతో టీడీపీ జరిపిన బేరసారాలను బయటపెట్టారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం… ప్రజల సమక్షంలోనే ఆ మాట చెప్పారు. నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన జయరాంతో బోయ సామాజికవర్గానికి చెందిన కొందరు … నియోజవకర్గంలో పనులు జరగడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా జయరాం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారలేదనే ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. పార్టీ మారితే […]

మరో వైసీపీ ఎమ్మెల్యే తనతో టీడీపీ జరిపిన బేరసారాలను బయటపెట్టారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం… ప్రజల సమక్షంలోనే ఆ మాట చెప్పారు.
నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన జయరాంతో బోయ సామాజికవర్గానికి చెందిన కొందరు … నియోజవకర్గంలో పనులు జరగడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా జయరాం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తాను పార్టీ మారలేదనే ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. పార్టీ మారితే మంత్రి పదవి, 50 కోట్లు ఇస్తామంటూ చంద్రబాబు మనుషులు తన వద్దకు వచ్చారని చెప్పారు.
కానీ ”మీ 50 కోట్లు నా వెంట్రుకతో సమానం అని చెప్పి పంపించా. బోయవాడు మాట మీద నిలబడుతాడు అన్నది మరోసారి నేను నిరూపించా. నా వల్ల మీ అందరూ గర్వపడేలా చేశా. భూమానాగిరెడ్డి 50 కోట్లకు, ఎస్వీమోహన్ రెడ్డి కోట్లకు కోట్లు తీసుకుని అమ్ముడుపోయారు” అని జయరాం వివరించారు. సొంత కులం వాళ్లే మోసం చేసినా కర్నూలు జిల్లాలో నేను పార్టీ మారకుండా నిలపడి జగనేతోనే శభాష్ అనిపించుకున్నానని చెప్పారు.