ఇన్‌ఫెక్షన్లను దూరం చేసే పండ్లు!
ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయడం సాధ్యమేనా? త్వరత్వరగా వ్యాపించే ఇన్‌ఫెక్షన్లను అదుపు చేయాలంటే డాక్టర్ల వద్దకు పరుగులు పెట్టాల్సిందేనా..? అస్సలు అవసరం లేదని నిపుణులంటున్నారు. మనకు అందుబాటులో ఉన్న అనేక పండ్లు పలు రకాల ఇన్‌ఫెక్షన్లను అదుపు చేస్తాయంటున్నారు. – బొప్పాయిలో ‘సి’ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయిలో ఉండే పీచు పదార్ధం అనేక రకాల ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. – అరటిలోనూ విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. […]
BY Pragnadhar Reddy19 Oct 2018 1:47 AM IST
X
Pragnadhar Reddy Updated On: 18 Sept 2018 3:09 AM IST
ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయడం సాధ్యమేనా? త్వరత్వరగా వ్యాపించే ఇన్‌ఫెక్షన్లను అదుపు చేయాలంటే డాక్టర్ల వద్దకు పరుగులు పెట్టాల్సిందేనా..? అస్సలు అవసరం లేదని నిపుణులంటున్నారు. మనకు అందుబాటులో ఉన్న అనేక పండ్లు పలు రకాల ఇన్‌ఫెక్షన్లను అదుపు చేస్తాయంటున్నారు.
– బొప్పాయిలో ‘సి’ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయిలో ఉండే పీచు పదార్ధం అనేక రకాల ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.
– అరటిలోనూ విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అరటిపండ్లను తినడం వల్ల జీవక్రియలు చాలా చురుకుగా మారతాయి. ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.
– నిగనిగలాడుతూ చూడగానే నోరూరించే నేరేడు పండ్లలో ఐరన్, ఫొలేట్, పొటాషియం, న్యూట్రియంట్స్ అధికంగా ఉన్నాయి. శరీరానికి హాని చేసే అనేక రకాల ఇన్‌ఫెక్షన్లతో ఇవి పోరాడతాయి. నేరేడు పండ్లలో కెలోరీలు కూడా తక్కువే. పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని బాగా పెంపొందిస్తాయి.
– యాపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి ఇన్‌ఫెక్షన్లతో పోరాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో యాపిల్ పండ్లూ కీలకపాత్ర పోషిస్తాయి.
Next Story