హీరో సిద్ధార్థ్ కి వార్నింగ్ ఇచ్చిన దర్శకుడు
‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగుతో మరిచిపోలేని హిట్ అందుకున్న సిద్ధార్థ్ ఈ మధ్య సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నాడు. ఈమధ్యనే ఒక సెటైర్ వేసి ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన సిద్ధార్థ్ ఇప్పుడు మీ టూ ఉద్యమం గురించి కామెంట్లు చేశాడు. మీటూ ని సపోర్ట్ చేస్తూ ట్విట్టర్లో పోస్టులు పెడుతూనే ఉన్నాడు. అందులో భాగంగా ఒక తమిళ దర్శకురాలు మణి మేఖలై కు మద్దతు ఇచ్చాడు. కొద్దిరోజుల […]

‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగుతో మరిచిపోలేని హిట్ అందుకున్న సిద్ధార్థ్ ఈ మధ్య సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నాడు. ఈమధ్యనే ఒక సెటైర్ వేసి ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన సిద్ధార్థ్ ఇప్పుడు మీ టూ ఉద్యమం గురించి కామెంట్లు చేశాడు. మీటూ ని సపోర్ట్ చేస్తూ ట్విట్టర్లో పోస్టులు పెడుతూనే ఉన్నాడు. అందులో భాగంగా ఒక తమిళ దర్శకురాలు మణి మేఖలై కు మద్దతు ఇచ్చాడు.
కొద్దిరోజుల క్రితం మణిమేఖలై దర్శకుడు సుశీ గణేశన్ గతంలో తనను లైంగికంగా వేధించాడని గట్టి ఆరోపణలే చేసింది. కారులో డ్రాప్ చేస్తానని చెప్పి వాహనంలోనే వేదించాడని చెప్పింది. దీనికి సిద్దార్థ్ తన మద్దతు ప్రకటించాడు. అయితే సుశీ గణేశన్ సిద్ధార్థ్ తండ్రికి ఫోన్ చేశాడట. ఇలా చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని బెదిరించాడని సిద్ధార్థ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
ఇకపై మణిమేఖలైకు ఎక్కువ మద్దతు ఇస్తానని, బెదిరే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేసాడు. మరి మణి మేఖలై ఆరోపణలకు, సిద్ధార్థ్ కామెంట్స్ పై సుశీ గణేశన్ అదే విక్రమ్ నటించిన ‘మల్లన్న’ సినిమా దర్శకుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.