Telugu Global
NEWS

క్రీడాకారుల సంపాదనలో సరికొత్త ప్రపంచ రికార్డు

మెక్సికో బాక్సర్ సరికొత్త చరిత్ర ఏడాదికి 5వేల కోట్ల రూపాయల సంపాదనతో అల్వారెజ్ టాప్ అల్వారెజ్ సంపాదన 365 మిలియన్ డాలర్లు మెక్సికన్ బాక్సర్, ప్రపంచ మిడిల్ వెయిట్ చాంపియన్ సాల్ కానెలో అల్వారెజ్… సంపాదనలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతిభారీ కాంట్రాక్టు సాధించిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. మియామీ మార్లిన్స్ కు చెందిన ఎన్ బీఏ స్టార్ గియాన్ కార్లో స్టాంటన్ పేరుతో… గత 13 ఏళ్ల కాలంగా ఉన్న 325 మిలియన్ డాలర్ల […]

క్రీడాకారుల సంపాదనలో సరికొత్త ప్రపంచ రికార్డు
X
  • మెక్సికో బాక్సర్ సరికొత్త చరిత్ర
  • ఏడాదికి 5వేల కోట్ల రూపాయల సంపాదనతో అల్వారెజ్ టాప్
  • అల్వారెజ్ సంపాదన 365 మిలియన్ డాలర్లు

మెక్సికన్ బాక్సర్, ప్రపంచ మిడిల్ వెయిట్ చాంపియన్ సాల్ కానెలో అల్వారెజ్… సంపాదనలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతిభారీ కాంట్రాక్టు సాధించిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు.
మియామీ మార్లిన్స్ కు చెందిన ఎన్ బీఏ స్టార్ గియాన్ కార్లో స్టాంటన్ పేరుతో… గత 13 ఏళ్ల కాలంగా ఉన్న 325 మిలియన్ డాలర్ల ప్రపంచ రికార్డును… ఈ మెక్సిన్ బాక్సర్ 365 మిలియన్ డాలర్లతో అధిగమించాడు.

వచ్చే ఐదేళ్ల కాలానికి… ప్రొఫెషనల్ బాక్సింగ్ లో… మొత్తం 11 ఫైట్లలో పాల్గొనేందుకు… అల్వారెజ్ కు 365 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించనున్నారు. ఈ మొత్తం మన రూపాయలలో.. 26వేల 769 కోట్ల రూపాయలకు సమానం. ఏడాదికి 125 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న విరాట్ కొహ్లీ లాంటి ఆటగాడినే చూసి మనదేశంలో వావ్ అనుకొంటుంటే…. ఏడాదికి 5వేల కోట్ల కు పైగా ఆర్జించే అల్వారెజ్ ను చూసి ..బాప్ రే బాప్ అనుకోవల్సిందే మరి.

ప్రపంచ క్రీడాచరిత్రలోనే అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రీడాకారుడు ఎవరంటే…మెక్సిన్ డైనమైట్ సాల్ కానెలో అల్వారెజ్ మాత్రమే అని… ఇకనుంచి చెప్పుకోక తప్పదు.

First Published:  19 Oct 2018 12:36 PM IST
Next Story