కూటమిలో అందరూ పోటుగాళ్లే..
తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పడడం లేదు. కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలు ఎవరికి వారే శక్తివంతులం అని ఊహించుకుంటూ సీట్ల కోసం పట్టుపడుతున్నాయి. కేటాయించే సీట్లలోనూ పక్కాగా గెలిచేవే కావాలని అన్ని పార్టీలు ఆశపడుతున్నాయి. దీంతో యవ్వారం తెగేలా లేదు. టీజేఎస్‌కు మూడు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెబుతుంటే కోదండరాం మాత్రం 16కు తగ్గేది లేదంటున్నారు. ఆ 16లో కూడా తమకు బలం ఉన్న స్థానాలనే డిమాండ్ చేస్తున్నారు. టీడీపీది అదే డిమాండ్. 2014లో గెలిచిన […]
తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పడడం లేదు. కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలు ఎవరికి వారే శక్తివంతులం అని ఊహించుకుంటూ సీట్ల కోసం పట్టుపడుతున్నాయి. కేటాయించే సీట్లలోనూ పక్కాగా గెలిచేవే కావాలని అన్ని పార్టీలు ఆశపడుతున్నాయి. దీంతో యవ్వారం తెగేలా లేదు. టీజేఎస్‌కు మూడు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెబుతుంటే కోదండరాం మాత్రం 16కు తగ్గేది లేదంటున్నారు. ఆ 16లో కూడా తమకు బలం ఉన్న స్థానాలనే డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీది అదే డిమాండ్. 2014లో గెలిచిన 15 సీట్లను తిరిగి తమకే కేటాయించడంతో పాటు మొత్తం 22 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ను టీడీపీ డిమాండ్ చేస్తోంది . కానీ టీడీపీ గత ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లో కాంగ్రెస్‌కు కూడా బలమైన అభ్యర్థులు, బలగం ఉంది.
ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు చాలెంజ్‌గా మారింది. ప్రతి పార్టీ సొంతంగా సర్వేలు చేయించుకుని … వారి బలం ఆధారంగా స్థానాలను కోరుతోంది. చాలాకాలంగా ఒకటి రెండు సీట్లలో మాత్రమే గెలుస్తూ వస్తున్న సీపీఐ కూడా కాంగ్రెస్ బలహీనతను ఆసరాగా చేసుకుని 12 సీట్లు ఇవ్వాల్సిందే అంటోంది. 119 స్థానాల్లో టీడీపీకి 22, టీజేఎస్‌కు 16, సీపీఐకి 12 సీట్లు కేటాయిస్తే 50 సీట్లు పోతాయి.
కాంగ్రెస్‌కు మిగిలేది 69 స్థానాలే. వాటిలోనూ కాంగ్రెస్ గెలిచే సీట్లు ఎన్ని అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే మహాకూటమి బలవంతంగా ఏర్పడినా … ఒకవేళ కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది ఆధిపత్యపోరుకు దారి తీయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.