యుద్ధం పూర్తిచేసిన సైరా నరసింహారెడ్డి
రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150ను చిరంజీవి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో తెలీదు కానీ, 151వ సినిమా సైరా నరసింహారెడ్డిని మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది సైరా. ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు మెగాస్టార్. తన సొంత సినిమానే కాబట్టి, ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నాడు. ఇందులో భాగంగా జార్జియాలో ఈ సినిమా షూటింగ్ కోసం చిన్నపాటి పట్టణాన్నే సృష్టించారు. అక్కడ సైరా సినిమాకు సంబంధించిన […]
రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150ను చిరంజీవి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో తెలీదు కానీ, 151వ సినిమా సైరా నరసింహారెడ్డిని మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది సైరా. ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు మెగాస్టార్. తన సొంత సినిమానే కాబట్టి, ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నాడు.
ఇందులో భాగంగా జార్జియాలో ఈ సినిమా షూటింగ్ కోసం చిన్నపాటి పట్టణాన్నే సృష్టించారు. అక్కడ సైరా సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ ను పిక్చరైజ్ చేశారు. దాదాపు 2వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, 200కు పైగా గుర్రాలతో భారీ ఎత్తున ఈ యాక్షన్ ఎపిసోడ్ తీశారు. కన్నడ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి సైతం ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు.
దాదాపు 44 కోట్ల రూపాయల బడ్జెట్ తీసిన ఈ షెడ్యూల్ ఎట్టకేలకు పూర్తయింది. జార్జియా షెడ్యూల్ కు చిరంజీవి ప్యాకప్ చెప్పాడు. చిరంజీవి కంటే ముందే సుదీప్, తన యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేసుకొని ఇండియాకు వచ్చేశాడు. మరో 2 రోజుల్లో చిరంజీవి కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అవుతాడు.
హైదరాబాద్ వచ్చిన వెంటనే మరో షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు రామోజీ ఫిలింసిటీలో మరో భారీ సెట్ నిర్మించారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, నయనతార మధ్య సన్నివేశాలు తీయాలని నిర్ణయించారు. జార్జియా షెడ్యూల్ తో 60శాతం టాకీ పూర్తయిందని చెబుతోంది యూనిట్.