Telugu Global
NEWS

సముద్రాన్ని కంట్రోల్ చేస్తా- సిక్కోలు జిల్లాలో చంద్రబాబు

ప్రకృతిని కంట్రోల్‌ చేయగలుగుతున్నా కానీ… రాజకీయాలను కంట్రోల్ చేయలేకపోతున్నానని రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తాజాగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన… తుఫానులకు కారణమవుతున్న సముద్రాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నానని వ్యాఖ్యానించారు. తుఫానుప్రభావం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తుగానే సముద్రాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నా అని చెప్పారు. తాను ఆవలిస్తే పేగులు లెక్కించే వ్యక్తిని అని వివరించారు. తనపై ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా […]

సముద్రాన్ని కంట్రోల్ చేస్తా- సిక్కోలు జిల్లాలో చంద్రబాబు
X

ప్రకృతిని కంట్రోల్‌ చేయగలుగుతున్నా కానీ… రాజకీయాలను కంట్రోల్ చేయలేకపోతున్నానని రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తాజాగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన… తుఫానులకు కారణమవుతున్న సముద్రాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నానని వ్యాఖ్యానించారు. తుఫానుప్రభావం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తుగానే సముద్రాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నా అని చెప్పారు.

తాను ఆవలిస్తే పేగులు లెక్కించే వ్యక్తిని అని వివరించారు. తనపై ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా ఏమీ చేయలేరన్నారు. తుఫాను ప్రాంతానికి పూర్వవైభవం తీసుకొస్తానన్నారు. ఇటు టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళిలో చంద్రబాబును తుఫాను బాధితులు ఘెరావ్ చేశారు.

తమకు భోజనాలు కూడా అందడం లేదని చంద్రబాబును నిలదీశారు. తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు… అధికారులు మీకు పాఠశాలలో అన్నం పెట్టడం లేదా అని ప్రశ్నించారు. బాధితులు లేదు అని సమాధానం ఇవ్వగా.. అధికారులకు బాగా బలిసిపోయిందంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి రావడం వెనుక వైసీపీ కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు.

First Published:  18 Oct 2018 2:20 AM IST
Next Story