Telugu Global
National

కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌ రాజీనామా

కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ బుధవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిరోజుల క్రితం నుంచి ‘మీటూ’ ఉద్యమ ప్రభావం వల్ల ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఆ సమయంలో ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇండియాకు రాగానే రాజీనామా చేస్తారని అందరూ భావించారు. ఒక వేళ ఆయన రాజీనామా చేయకపోయినా మోడీ ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఆయన రాజీనామా […]

కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌ రాజీనామా
X

కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ బుధవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. కొద్దిరోజుల క్రితం నుంచి ‘మీటూ’ ఉద్యమ ప్రభావం వల్ల ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్రమయ్యాయి.

ఆ సమయంలో ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇండియాకు రాగానే రాజీనామా చేస్తారని అందరూ భావించారు. ఒక వేళ ఆయన రాజీనామా చేయకపోయినా మోడీ ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని అనుకున్నారు.

అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఆయన రాజీనామా చేయకపోగా ఆయన పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన ప్రియ రమణి పై పరువునష్టం దావా వేశారు. దాంతో ఆయన నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న సుమారు 20-30 మంది మహిళా జర్నలిస్టులు, ఒక మహిళా పారిశ్రామిక వేత్త తదితరులు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం, కోర్టులో కేసు వేయడానికి సిద్ధమవడం మొదలైన పరిణామాల నేపధ్యంలో కేంద్రప్రభుత్వం ఆయనచేత బలవంతంగా రాజీనామా చేయించినట్లుగా భావిస్తున్నారు.

First Published:  17 Oct 2018 3:52 PM IST
Next Story