Telugu Global
National

కేంద్రమంత్రి అక్బర్‌ పై లైంగిక ఆరోపణల వెల్లువ

కేంద్రమంత్రి, మాజీ జర్నలిస్ట్‌ ఎంజే అక్బర్‌ పై దేశవ్యాప్తంగా లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో మహిళా జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఒక గౌరవనీయమైన వ్యక్తి పై ఇంతమంది స్త్రీలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సందర్భం బహుశా భారత దేశ చరిత్రలోనే లేదు. రాఫెల్‌ వివాదంలో తలమునకలై ఉన్న కేంద్ర ప్రభుత్వం అక్బర్‌ ను రక్షించే ప్రయత్నం చేయడం ద్వారా తన పరువు మరింతగా తీసేసుకుంటోంది. ఒక వ్యక్తి మీద ఒకటో రెండో […]

కేంద్రమంత్రి అక్బర్‌ పై లైంగిక ఆరోపణల వెల్లువ
X

కేంద్రమంత్రి, మాజీ జర్నలిస్ట్‌ ఎంజే అక్బర్‌ పై దేశవ్యాప్తంగా లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో మహిళా జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

ఒక గౌరవనీయమైన వ్యక్తి పై ఇంతమంది స్త్రీలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సందర్భం బహుశా భారత దేశ చరిత్రలోనే లేదు. రాఫెల్‌ వివాదంలో తలమునకలై ఉన్న కేంద్ర ప్రభుత్వం అక్బర్‌ ను రక్షించే ప్రయత్నం చేయడం ద్వారా తన పరువు మరింతగా తీసేసుకుంటోంది.

ఒక వ్యక్తి మీద ఒకటో రెండో ఆరోపణలు వస్తే బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ ఆ వ్యక్తికి ఇవ్వవచ్చు. శత్రువులు ఎవరైనా టార్గెట్‌ చేశారు అనుకోవచ్చు. కానీ పదుల సంఖ్యలో స్త్రీలు తమ మీద అక్బర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని బహిరంగంగా బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం సిగ్గు చేటు.

తన మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, బరితెగించి ప్రియా రమణి పై అక్బర్‌ పరువు నష్టం దావా వేయడంతో ఆమెకు మద్దత్తుగా 20 మందికి పైగా మహిళా జర్నలిస్టులు కోర్టుకెక్కనున్నారు. ఎంజే అక్బర్‌ బాధితులైన ఇంకా అనేకమంది మహిళా జర్నలిస్టులు త్వరలో వీళ్ళతో కలవనున్నారు.

ఎంజే అక్బర్‌ ఎడిటర్‌గా ఉన్న సమయంలో మహిళా జర్నలిస్టులను తను బస చేసే హోటల్‌కు పిలవడం…. వాళ్ళు వచ్చినప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండా డ్రాయర్‌తోనో, టవల్‌తోనో ఉండి వాళ్ళను లోపలికి ఆహ్వానించడం…. వాళ్ళను బలవంతంగా కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడని అనేకమంది ఆరోపణలు చేశారు.

ఈ మద పిచ్చి తనతో పనిచేసే స్త్రీలకే పరిమితం చేయకుండా…. తనను కలవడానికి వచ్చే మహిళా ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలపై కూడా ఇలాంటి నికృష్ట చేష్టలకు పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలు చూశాక…. మోడీ గారూ…. మీరు ఈ దేశంలో అమ్మాయిలను రక్షించడానికి బేటీ బచావో…. అంటూ తెగ శ్రమ పడవద్దు…. మీ మంత్రి వర్గంలోని మద పిచ్చి మంత్రి నుంచి స్త్రీలను రక్షించడానికి కాస్త దృష్టి పెట్టండి చాలు…. అంటున్నారు.

First Published:  17 Oct 2018 2:49 AM IST
Next Story