సంపూర్ణ సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రంగా సిక్కింకు ఐరాస అవార్డు
సిక్కిం రాష్ట్రం ఓ అరుదైన ఘనతను సాధించింది. సంపూర్ణంగా సేంద్రీయ సేద్యం జరుపుతున్న రాష్ట్రంగా ఐక్యరాజ్యసమితి చేత గుర్తింపును పొందింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (యూఎన్ ఎఫ్‌ఎఓ) ఈ మేరకు ఓ అవార్డును ప్రకటించింది. ప్రపంచంలోనే ఇలాంటి ఘనత సాధించిన తొలి రాష్ట్రం సిక్కిం కావడం గమనార్హం. ‘ఫ్యూచర్ పాలసీ ఫర్ గోల్డ్’ పేరుతో ప్రారంభించిన ఈ అవార్డును సిక్కిం దక్కించుకుంది. వ్యవసాయ పరిరక్షణ, సంతులిత ఆహార వ్యవస్థలపై అనుసరిస్తున్న విధానాల ఆధారంగా సిక్కింను […]
సిక్కిం రాష్ట్రం ఓ అరుదైన ఘనతను సాధించింది. సంపూర్ణంగా సేంద్రీయ సేద్యం జరుపుతున్న రాష్ట్రంగా ఐక్యరాజ్యసమితి చేత గుర్తింపును పొందింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (యూఎన్ ఎఫ్‌ఎఓ) ఈ మేరకు ఓ అవార్డును ప్రకటించింది. ప్రపంచంలోనే ఇలాంటి ఘనత సాధించిన తొలి రాష్ట్రం సిక్కిం కావడం గమనార్హం.
‘ఫ్యూచర్ పాలసీ ఫర్ గోల్డ్’ పేరుతో ప్రారంభించిన ఈ అవార్డును సిక్కిం దక్కించుకుంది. వ్యవసాయ పరిరక్షణ, సంతులిత ఆహార వ్యవస్థలపై అనుసరిస్తున్న విధానాల ఆధారంగా సిక్కింను ఎంపిక చేసినట్లు ఎఫ్‌ఎఓ ఓ ప్రకటనలో తెలిపింది. 25 దేశాల నుంచి 51 నామినేషన్లు అందాయని అందులో గోల్డ్‌కు సిక్కిం ఎంపికయ్యిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
బ్రెజిల్, డెన్మార్క్, ఈక్వెడార్‌లు సిల్వర్ అవార్డుకు ఎంపికయ్యాయి. సిక్కిం సేంద్రీయ వ్యవసాయం వల్ల 66 వేల మంది రైతులు లబ్ధిపొందుతున్నారని, పర్యాటకం కూడా బాగా అభివృద్ది చెందిందని ఆ ప్రకటన తెలిపింది. సిక్కింలో రసాయన ఎరువులను, పురుగుమందులను పూర్తిగా నిషేధించారు. 2016 నాటికే సంపూర్ణ సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రంగా సిక్కిం గుర్తింపు పొందింది.