Telugu Global
NEWS

కాంగ్రెస్ వైపు చారి చూపు !

తెలంగాణలో పార్టీలు మారే టైమ్ న‌డుస్తోంది. మొన్న‌టిదాకా అధికార పార్టీలోకి జంప్‌లు జ‌రిగితే…ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అవుతోంది. ఒక్కొక్క‌రుగా నేత‌లు గులాబీ గూటిని వీడుతున్నారు. ఇప్ప‌టికే ఎమ్మెల్సీ రాములు నాయ‌క్ టీఆర్ఎస్ వీడ‌డం ఖాయ‌మైంది. ఆయ‌న‌తో పాటు డీఎస్‌, కాకా కుమారుడు వినోద్ కాంగ్రెస్‌లో చేర‌డం ఖాయ‌మైంది. తాజాగా టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవ‌డానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. మాజీ కేంద్రమంత్రిగా సీనియ‌ర్ నాయ‌కుడైన […]

కాంగ్రెస్ వైపు చారి చూపు !
X

తెలంగాణలో పార్టీలు మారే టైమ్ న‌డుస్తోంది. మొన్న‌టిదాకా అధికార పార్టీలోకి జంప్‌లు జ‌రిగితే…ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అవుతోంది. ఒక్కొక్క‌రుగా నేత‌లు గులాబీ గూటిని వీడుతున్నారు. ఇప్ప‌టికే ఎమ్మెల్సీ రాములు నాయ‌క్ టీఆర్ఎస్ వీడ‌డం ఖాయ‌మైంది. ఆయ‌న‌తో పాటు డీఎస్‌, కాకా కుమారుడు వినోద్ కాంగ్రెస్‌లో చేర‌డం ఖాయ‌మైంది.

తాజాగా టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవ‌డానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. మాజీ కేంద్రమంత్రిగా సీనియ‌ర్ నాయ‌కుడైన త‌న‌కు కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన విఠ‌ల్‌రెడ్డికి ముథోల్ టిక్కెట్టు ఇవ్వడంతో చారి అస‌హ‌నంతో ఉన్నారు.

2014 ఎన్నిక‌ల్లో ముథోల్‌లో వేణుగోపాలాచారి మీద కాంగ్రెస్ అభ్యర్ధి విఠ‌ల్‌రెడ్డి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత విఠ‌ల్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేర‌డంతో వేణుగోపాల‌చారికి డోర్లు మూసుకుపోయాయి.

విఠ‌ల్‌రెడ్డికి టికెట్ రావ‌డంతో చారి మ‌న‌స్తాపం చెందారు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో త‌న రాజ‌కీయ భ‌విష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంద‌ని వేణుగోపాలాచారి క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో రెండువారాలు భైంసాలో చారి మ‌కాం వేశారు. అనుచ‌రుల‌తో మంత‌నాలు జ‌రిపారు. టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాల‌ని ఆందోళ‌న చేశారు.

అయితే పార్టీ హైక‌మాండ్ ఆయనతో మంత‌నాలు జ‌రిపింది. బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసింది. దీంతో టికెట్ రాద‌ని నిర్ణ‌యించుకున్న చారి… కాంగ్రెస్ వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముథోల్ నియోజ‌వ‌ర్గంలో బ‌ల‌మైన కాంగ్రెస్ లీడ‌ర్ లేక‌పోవ‌డంతో త‌న‌కు కాంగ్రెస్ టిక్కెట్టు సునాయాసంగా రావ‌చ్చన్నది చారి అంచ‌నా! ప‌రిస్ధితుల్ని బేరీజు వేసుకున్న త‌ర్వాత, కార్యక‌ర్తల‌తో మాట్లాడి చారి రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ లో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

First Published:  16 Oct 2018 11:03 AM IST
Next Story