Telugu Global
CRIME

లోన్‌ ఇస్తా.... కోరిక తీరుస్తావా! " బ్యాంకు మేనేజర్‌ను కుమ్మేసిన మహిళ

కర్నాటకలో ఒక బ్యాంకు మేనేజర్‌కు బడితపూజ జరిగింది. లోన్ కోసం వచ్చిన ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి చివరకు అందరి ముందు ఆ మహిళ చేతుల్లోనే తన్నులు తిన్నాడు. దేవనగెరెకు చెందిన ఒక మహిళ వ్యాపారం ప్రారంభించేందుకు లోన్‌ కావాలంటూ స్థానిక బ్యాంకును సంప్రదించింది. పత్రాలు పరిశీలించిన మేనేజర్‌… లోన్‌ ఇస్తాను గానీ… నాకేంటి అని ప్రశ్నించారు. తొలుత లంచం అడుగుతున్నాడేమోనని మహిళ భావించింది. ఏం కావాలో చెప్పండి అని అడగ్గానే.. ఆమె చేయి పట్టుకుని అసభ్యకరంగా […]

లోన్‌ ఇస్తా.... కోరిక తీరుస్తావా!  బ్యాంకు మేనేజర్‌ను కుమ్మేసిన మహిళ
X

కర్నాటకలో ఒక బ్యాంకు మేనేజర్‌కు బడితపూజ జరిగింది. లోన్ కోసం వచ్చిన ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి చివరకు అందరి ముందు ఆ మహిళ చేతుల్లోనే తన్నులు తిన్నాడు.

దేవనగెరెకు చెందిన ఒక మహిళ వ్యాపారం ప్రారంభించేందుకు లోన్‌ కావాలంటూ స్థానిక బ్యాంకును సంప్రదించింది. పత్రాలు పరిశీలించిన మేనేజర్‌… లోన్‌ ఇస్తాను గానీ… నాకేంటి అని ప్రశ్నించారు. తొలుత లంచం అడుగుతున్నాడేమోనని మహిళ భావించింది. ఏం కావాలో చెప్పండి అని అడగ్గానే.. ఆమె చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

చిర్రెత్తుకొచ్చిన సదరు మహిళ మేనేజర్‌ను బ్యాంకు నుంచి బయటకు ఈడ్చుకొచ్చి పెద్ద కర్ర తీసుకుని చితక్కొట్టింది. ఆ సన్నివేశాన్ని అక్కడున్న వారు సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. మహిళ కర్రతో కొడుతుంటే చేతులు కట్టుకుని అమాయకంగా నిలబడ్డాడు మేనేజర్. స్థానికులు కొందరు జోక్యం చేసుకుని మహిళకు అండగా నిలిచారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

First Published:  16 Oct 2018 8:40 AM IST
Next Story