Telugu Global
NEWS

తుపాను బాధితులకు అండగా నిఖిల్

కేవలం సినిమాలే కాకుండా సమకాలీన అంశాలు, రాజకీయాలపై స్పందిస్తుంటాడు హీరో నిఖిల్. ఈసారి కూడా నిఖిల్ రియాక్ట్ అయ్యాడు. తిత్లీ తుపానులో తీవ్రంగా గాయపడిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు తనవంతుగా ముందుకొచ్చాడు. ఏకంగా తనే, సహాయ సామగ్రితో పాటు శ్రీకాకుళంలో ల్యాండ్ అయ్యాడు. 2500 kilos of Rice 500 Blankets Portable Generators for Power cuts.Dinner for 3000 people who need cooked food immediately.Was arranging these things here in […]

తుపాను బాధితులకు అండగా నిఖిల్
X

కేవలం సినిమాలే కాకుండా సమకాలీన అంశాలు, రాజకీయాలపై స్పందిస్తుంటాడు హీరో నిఖిల్. ఈసారి కూడా నిఖిల్ రియాక్ట్ అయ్యాడు. తిత్లీ తుపానులో తీవ్రంగా గాయపడిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు తనవంతుగా ముందుకొచ్చాడు. ఏకంగా తనే, సహాయ సామగ్రితో పాటు శ్రీకాకుళంలో ల్యాండ్ అయ్యాడు.

తుపాను బాధితులకు 2వేల 500 కిలోల బియ్యం, 5వందల దుప్పట్లు, కరెంట్ లేని ప్రాంతాల్లో ఉపయోగపడేలా జనరేటర్లు తనవంతు సహాయంగా అందించాడు నిఖిల్. అంతేకాదు, అప్పటికప్పుడు ఆకలితో ఉన్న 3 వేల మందికి భోజనం కూడా ఏర్పాటు చేశాడు. ఇలా తుపాను బాధితుల్ని ఆదుకొని తన నిండుమనసు చాటుకున్నాడు నిఖిల్.

తుపాను సహాయార్థం టాలీవుడ్ నుంచి ఇప్పుడిప్పుడే హీరోలు రియాక్ట్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ తనవంతుగా కొంత మొత్తాన్ని తుపాను సహాయనిధికి అందజేయగా, ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ కూడా తమవంతుగా ఆర్థిక సహాయం చేశారు. అయితే నిఖిల్ మాత్రం కేవలం సహాయంతో సరిపెట్టకుండా తనే నేరుగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అందర్నీ పరామర్శించాడు. జిల్లాలోని గుప్పిడిపేట, పల్లెసారథి గ్రామాల్లో పర్యటించిన నిఖిల్.. ఈరోజు మరికొన్ని గ్రామాల్ని సందర్శించబోతున్నాడు.

First Published:  16 Oct 2018 3:45 AM IST
Next Story