Telugu Global
NEWS

అనిత డ్రైవర్ కూడా అవకాశాలు వెతుక్కుంటున్నాడా?

సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవాలి… దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫాలో అవుతున్న సిద్ధాంతం ఇది. నేతల చుట్టూ ఉన్న వారు కూడా ఏదో ఒక మార్గంలో ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అనిత కారు డ్రైవర్ కూడా అదే పనిచేశారు. కానీ దొరికిపోయాడు. కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అనిత కారు డ్రైవర్‌ అఖిల్‌ ఏకంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి పేరుతో నకిలీ సిఫార్సు లేఖను […]

అనిత డ్రైవర్ కూడా అవకాశాలు వెతుక్కుంటున్నాడా?
X

సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవాలి… దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫాలో అవుతున్న సిద్ధాంతం ఇది. నేతల చుట్టూ ఉన్న వారు కూడా ఏదో ఒక మార్గంలో ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అనిత కారు డ్రైవర్ కూడా అదే పనిచేశారు. కానీ దొరికిపోయాడు.

కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అనిత కారు డ్రైవర్‌ అఖిల్‌ ఏకంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి పేరుతో నకిలీ సిఫార్సు లేఖను సృష్టించాడు. తనకు కావాల్సిన వ్యక్తికి విద్యుత్ సబ్‌ స్టేషన్ లో ఉద్యోగం ఇప్పించుకునేందుకు ప్రయత్నించిన అఖిల్‌ అందుకు మంత్రి స్థాయి వ్యక్తి సిఫార్సు అవసరం అని తెలుసుకుని యనమల పేరుతో లేఖను సృష్టించాడు.

ఆ లేఖను మంత్రి కళా వెంకట్రావ్‌ వరకు వెళ్లేలా చేయగలిగాడు. అయితే లేఖపై కళా వెంకట్రావ్‌ నేరుగా యనమల రామకృష్ణుడికి ఫోన్ చేసి అనిత డ్రైవర్‌ తెచ్చిన లేఖ గురించి ఆరా తీశారు. దీంతో మోసం బయటపడింది. వెంటనే ఆర్థిక శాఖ అధికారులు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. సదరు నకిలీ లేఖ సృష్టికర్త ఎమ్మెల్యే అనిత కారు డ్రైవర్‌ అని పోలీసులు తేల్చారు.

విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన అనిత తన డ్రైవర్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంత్రి పేరుతో నకిలీ లేఖను సృష్టించిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తీసేయాల్సింది పోయి… తన డ్రైవర్‌పై కేసు నమోదు చేయవద్దని పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు.

ఈ వ్యవహారం బయటకు వచ్చి రోజులు గడుస్తున్నా పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడం లేదు. నిందితుడు అనిత డ్రైవర్ అని తెలిసిన తర్వాత టీడీపీ మంత్రులు కూడా కేసు నమోదుకు ఒత్తిడి తేవడం లేదు.

First Published:  15 Oct 2018 7:55 PM GMT
Next Story