జానారెడ్డిని ఇరికించిన ఉత్తమ్? కారణం అదేనా?
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఈ మధ్య వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తనకు సీఎం రేసులో పోటీ వస్తున్నారని అనుకున్న నేతలను తెలివిగా సైడ్ చేస్తున్నారు. లేక ఏదో ఒక విషయంలో వారిని ఇరికిస్తున్నారు. ఇంతకుముందు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న భట్టివిక్రమార్కను ఇలా సైడ్‌లైన్ చేసే కార్యక్రమం చేపట్టారు. దీంతో భట్టి తేరుకున్నారు. జానావర్గం నుంచి ఉత్తమ్ వర్గానికి జంప్ అయ్యారు. ఉత్తమ్ తో సయోధ్య కుదుర్చుకున్నారు. ప్రచార కమిటీ పదవి కొట్టేశారు. రేవంత్‌కు ఈ పదవి […]
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఈ మధ్య వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తనకు సీఎం రేసులో పోటీ వస్తున్నారని అనుకున్న నేతలను తెలివిగా సైడ్ చేస్తున్నారు. లేక ఏదో ఒక విషయంలో వారిని ఇరికిస్తున్నారు.
ఇంతకుముందు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న భట్టివిక్రమార్కను ఇలా సైడ్‌లైన్ చేసే కార్యక్రమం చేపట్టారు. దీంతో భట్టి తేరుకున్నారు. జానావర్గం నుంచి ఉత్తమ్ వర్గానికి జంప్ అయ్యారు. ఉత్తమ్ తో సయోధ్య కుదుర్చుకున్నారు. ప్రచార కమిటీ పదవి కొట్టేశారు. రేవంత్‌కు ఈ పదవి రాకుండా చేయాలని ఉత్తమ్ భట్టితో మిలాఖత్ అయ్యారు. ఇక్కడ ఉత్తమ్ పాచిక పారింది.
ఇప్పుడు జానారెడ్డిని కూడా ఇలాగే టార్గెట్ చేశారు. మహాకూటమి సీట్ల లెక్కలు తేలడం లేదు. కూటమి సీట్ల లెక్క తేల్చే వ్యవహారాన్ని జానారెడ్డి నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ఈ కమిటీలో పొన్నం ప్రభాకర్, వినయ్ కుమార్, చిన్నారెడ్డి ఉన్నారు.
అయితే కమిటీ ముందు ఇప్పుడు పెద్ద టాస్క్ ఉంది. కూటమిలో పార్టీల సీట్ల లెక్క తేల్చాలి. ఒకవేళ ఇతర పార్టీలకు సీట్లు ఎక్కువ ఇస్తే గండం. అంతేకాదు వారు కోరుతున్న సీట్లు… అది కూడా కాంగ్రెస్ నేతలు కీలకంగా ఉన్న స్థానాలు ఇవ్వాలని పట్టుపడితే అదో పెద్ద తలనొప్పి. దీంతో జానాను ఇలా సాఫ్ట్‌గా ఉత్తమ్ కార్నర్ చేశారని గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ అధికారానికి అవసరమైన సీట్లు గెలవలేదనుకోండి…. కూటమికి ఇచ్చిన సీట్లు ఓడిపోతే…. జానారెడ్డిని బదనాం చేయొచ్చు. తాను తప్పుకోవచ్చు. ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారంతో జానారెడ్డికి తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి ఉత్తమ్ ప్లాన్‌లు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి అంటే సీట్ల సర్దుబాటు వ్యవహారం తేలాల్సి ఉంది.