తలపాగా చుట్టలేదని బోండాగిరి.... ఈవోపై చిందులు
టీడీపీ ఎమ్మెల్యే , టీటీడీ సభ్యుడు బోండా ఉమా వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది. తమ నేతను అవమానించారంటూ విజయవాడ దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మతో బోండా అనుచరులు వాగ్వాదానికి దిగారు. సాంప్రదాయం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దుర్గమ్మకు పట్టువస్త్రాలను తీసుకుని టీటీడీ ఏఈవో సాయిలు వచ్చారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న విషయాన్ని విజయవాడకు చెందిన టీటీడీ సభ్యుడు అయిన బోండా ఉమాకు సమాచారం చేరవేశారు. దీంతో బోండా ఉమా ఇంద్రకీలాద్రి పైకి వచ్చారు. ఆలయ అధికారులు […]
టీడీపీ ఎమ్మెల్యే , టీటీడీ సభ్యుడు బోండా ఉమా వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది. తమ నేతను అవమానించారంటూ విజయవాడ దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మతో బోండా అనుచరులు వాగ్వాదానికి దిగారు.
సాంప్రదాయం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దుర్గమ్మకు పట్టువస్త్రాలను తీసుకుని టీటీడీ ఏఈవో సాయిలు వచ్చారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న విషయాన్ని విజయవాడకు చెందిన టీటీడీ సభ్యుడు అయిన బోండా ఉమాకు సమాచారం చేరవేశారు. దీంతో బోండా ఉమా ఇంద్రకీలాద్రి పైకి వచ్చారు.
ఆలయ అధికారులు ప్రోటోకాల్ ప్రకారమే టీటీడీ ఏఈవో సాయిలుకు తలపాగా చుట్టి ఆయన తలపై పట్టువస్త్రాలు ఉంచి అమ్మవారి ఆలయంలోకి ఆహ్వానించారు. అంతే అక్కడే ఉన్న బోండా ఉమాకు రగిలింది. టీటీడీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని టీటీడీ ఏఈవోకు తలపాగా చుట్టి ఆయనకు స్వాగతం పలకడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అధికారులు తనను అవమానించారంటూ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో పాల్గొనకుండానే బోండా ఉమా వెళ్లిపోయారు.
ఆయన అలా వెళ్లగానే అనుచరులు రంగ ప్రవేశం చేశారు. ఆలయం సమీపంలోనే ఈవో కోటేశ్వరమ్మతో వాగ్వాదానికి దిగారు. తమ నేతను అవమానించారంటూ మండిపడ్డారు. అమ్మవారి ఆలయ సిబ్బంది మాత్రం ప్రోటోకాల్ ప్రకారమే టీటీడీ ఏఈవో ద్వారా పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించామని చెబుతున్నారు.