Telugu Global
CRIME

బాబా రాంపాల్ కు జీవితఖైదు....

తనను తాను కలియుగ దేవుడిగా చెప్పుకొని హత్యలు, అత్యాచారాలకు పాల్పడ్డ గురువు ఆట కట్టైంది. న్యాయస్థానంలో మంగళవారం తగిన శిక్ష పడింది. హర్యానా రాష్ట్రంలోని హిసార్ లో సత్ లోక్ ఆశ్రమ్ ను స్థాపించిన 67 ఏళ్ల బాబా రాంపాల్ కు ఇక్కడి హిసార్ సెషన్స్ కోర్టు మంగళవారం మధ్యాహ్నం జీవిత ఖైదు విధించింది. ఈయన రెండు హత్య కేసుల్లో దోషిగా తేలారు. రాంపాల్ అనుచరులు పదిహేను మందికి కూడా కోర్టు ఇదే శిక్ష విధించింది. హర్యానాలో […]

బాబా రాంపాల్ కు జీవితఖైదు....
X

తనను తాను కలియుగ దేవుడిగా చెప్పుకొని హత్యలు, అత్యాచారాలకు పాల్పడ్డ గురువు ఆట కట్టైంది. న్యాయస్థానంలో మంగళవారం తగిన శిక్ష పడింది. హర్యానా రాష్ట్రంలోని హిసార్ లో సత్ లోక్ ఆశ్రమ్ ను స్థాపించిన 67 ఏళ్ల బాబా రాంపాల్ కు ఇక్కడి హిసార్ సెషన్స్ కోర్టు మంగళవారం మధ్యాహ్నం జీవిత ఖైదు విధించింది. ఈయన రెండు హత్య కేసుల్లో దోషిగా తేలారు. రాంపాల్ అనుచరులు పదిహేను మందికి కూడా కోర్టు ఇదే శిక్ష విధించింది.

హర్యానాలో తనని తాను దైవాంశ సంభూతుడిగా పేర్కొంటూ బాబా రాంపాల్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. వేల కోట్లు సంపాదించాడు. తనకు అడ్డుగా వచ్చిన పలువురిని హత్యలు చేసినట్టు ఆరోపణలున్నాయి. అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను గుప్పిట పట్టి భూములను కొల్లగొట్టి వేలకోట్ల సామ్రాజాన్ని సృష్టించాడు. చివరకు హత్యల్లో పలువురి ఫిర్యాదులతో ఈయన డొంక కదిలింది.

రాంపాల్ రెండు హత్యలు, ఇతర నేరాల్లో అరెస్ట్ అయ్యాడు. హర్యానాలోని హిసార్ జిల్లా జైలులో ప్రత్యేకంగా ఇతడికోసం న్యాయస్థానం ఏర్పాటు చేశారు. బయటకు తీసుకొస్తే అల్లర్లు చెలరేగే ప్రమాదముందని ఈ పనిచేశారు. ఈ జైలు న్యాయస్థానంలో నాలుగేళ్ల పాటు విచారణ జరిగింది. 2014 నుంచి రాంపాల్, ఆయన అనుచరులు జైలు జీవితం గడుపుతున్నారు.

2014 నవంబర్ 19న రాంపాల్, ఆయన అనుచరులపై బర్వాలా పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. రాంపాల్ ఆశ్రమంలో ఉన్న తమ భార్యలు హత్యకు గురయ్యారని వారి భర్తలు ఢిల్లీకి చెందిన శివపాల్, యూపీకి చెందిన సురేష్ లు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు విచారించారు. ఎట్టకేలకు న్యాయస్థానంలో వీరికి జీవిత ఖైదు ఖరారైంది.

First Published:  16 Oct 2018 8:15 AM IST
Next Story