Telugu Global
Family

ఆరు ప్ర‌శ్న‌లు 

సుకేశుడు, స‌త్య‌కాముడు, గార్గ్యుడు, అశ్వ‌లాయ‌నుడు, భార్గ‌వుడు, క‌బంధి అనే ఆరు మంది స‌త్యాన్వేష‌ణ కోసం బ‌య‌ల్దేరారు. గురువు లేనిదే స‌త్యాన్ని గ్ర‌హించ‌డం క‌ష్టం. కాబ‌ట్టి వాళ్లు గురువును అన్వేషించారు. అదృష్టం కొద్దీ వాళ్ల‌కు పిప్పిలాదుడ‌నే మ‌హ‌ర్షి దొరికాడు.         పిప్పిలాద మ‌హ‌ర్షి వాళ్ల‌ని సంవ‌త్స‌రం పాటు బ్ర‌హ్మ చ‌ర్య‌దీక్ష పాటించ‌మ‌ని, త‌న ఆశ్ర‌మంలో ఉండ‌మ‌ని చెప్పాడు. సంవ‌త్స‌రం పాటు వాళ్లు   శ్ర‌ద్ధ‌గా గురువు శుశ్రూష చేశారు.          ఒక […]

సుకేశుడు, స‌త్య‌కాముడు, గార్గ్యుడు, అశ్వ‌లాయ‌నుడు, భార్గ‌వుడు, క‌బంధి అనే ఆరు మంది స‌త్యాన్వేష‌ణ కోసం బ‌య‌ల్దేరారు. గురువు లేనిదే స‌త్యాన్ని గ్ర‌హించ‌డం క‌ష్టం. కాబ‌ట్టి వాళ్లు గురువును అన్వేషించారు. అదృష్టం కొద్దీ వాళ్ల‌కు పిప్పిలాదుడ‌నే మ‌హ‌ర్షి దొరికాడు.
పిప్పిలాద మ‌హ‌ర్షి వాళ్ల‌ని సంవ‌త్స‌రం పాటు బ్ర‌హ్మ చ‌ర్య‌దీక్ష పాటించ‌మ‌ని, త‌న ఆశ్ర‌మంలో ఉండ‌మ‌ని చెప్పాడు. సంవ‌త్స‌రం పాటు వాళ్లు శ్ర‌ద్ధ‌గా గురువు శుశ్రూష చేశారు.
ఒక రోజు క‌బంధుడ‌నే శిష్యుడు గురువుతో ‘గురుదేవా! ఈ క‌నిపిస్తున్న లోకాన్నంతా ఎవ‌రు సృష్టించారు ? ఈ సృష్టికి ఏది కార‌ణం’ అన్నాడు.
పిప్పిలాదుడు ‘నాయ‌నా త‌న స‌కంల్పం నించీ బ్ర‌హ్మ ఈ సృష్టి చేశాడు. ఆ సంక‌ల్పం కోసం తప‌స్సు చేశాడు. ఆ త‌ప‌స్సు నుంచి ప్ర‌కృతి ఆవిర్భవించింది. ప్ర‌కృతిలోని శ‌క్తులు ప్ర‌భ‌విల్లాయి. సూర్యుడు తూర్పున ఉద‌యిస్తూనే బంగారు కిర‌ణాల్తో లోకాన్ని వెలిగిస్తాడు. బ్ర‌హ్మ‌శ‌క్తి పొందాలంటే త‌పోవిధాన‌మే స‌రైన మార్గం’ అన్నాడు.
కొన్నాళ్లు గ‌డిచాకా ఒక‌రోజు రెండో శిష్యుడైన భార్గ‌వుడు ‘గురుదేవా ఈ సృష్టి బ్ర‌హ్మ సంక‌ల్పం నించి జ‌రిగింద‌న్నారు. ఈ సృష్టిలో అత్యున్న‌మైన‌ది ప్రాణి. ఈ ప్రాణికి ఆధార‌మైంది ఏది? దాంట్లో దాగి ఉన్న శ‌క్తి ఏది?’ అని అడిగాడు.
పిప్పిలాదుడు ‘ప్రాణికి ఆధారం ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృధివి, వాక్కు, నేత్రం, శ్ర‌వ‌ణేంద్రియాలు, మ‌న‌స్సు అంటారు. ఇవ‌న్నీ శ‌రీరాన్ని నిలిపేవి. కానీ ప్రాణం తానే గొప్ప‌ద‌న్న‌ది. కానీ ఇత‌ర శ‌క్తులు ప్రాణాన్ని లెక్క‌పెట్ట‌లేదు. ఐతే ఓసారి ప్రాణం శ‌రీరాన్ని వ‌దిలి వెళ్లింది. దాంతో శ‌రీరం నిర్జీవ‌మైంది. రాణి ఈగ తెనెతుట్టెను వ‌దిలివెళితే త‌క్కిన తేనెటీగ‌లూ వెళ్లిపోయిన‌ట్టు ప్రాణంపోతే పంచేంద్రియాలూ ప‌ని చేయ‌వు. కాబ‌ట్టి ప్రాణ‌మే ఆధారం’ అన్నాడు.
ఈ మాట‌లు విని అశ్వ‌లాయ‌కుడు ‘ఈ ప్రాణం దేని నుంచీ పుట్టింది ? ఎలా వెళ్లిపోతుంది ? అది శ‌రీరాన్ని ఎలా ర‌క్షిస్తోంది?’ అని అడిగాడు.
పిప్పిలాదుడు ‘ప్రాణానికి ఆత్మ ఆధారం. శ‌రీరానికీ ఆత్మ ఆధారం. ఆత్మ హృద‌యంలో నిల్చినంత కాలం ప్రాణం ఉంటుంది. కాబ‌ట్టి ప్రాణానికి ఆత్మే ఆధారం’ అన్నాడు.
గార్గ్యుడు ‘స్వామీ జీవిలో జాగ్ర‌ద‌వ‌స్థ‌లో ఎవ‌రు మేలుకుని ఉంటారు? సుషుప్తిలో ఎవ‌రు నిద్ర‌పోతూ ఉంటారు? ఈ సుఖ దుఃఖాల్ని అనుభ‌వించేదెవ‌రు?’
పిప్పిలాదుడు ‘ఉద‌యాస్త‌మ‌యాల్లో సూర్య కిర‌ణాల్లా చైత‌న్య శ‌క్తి మ‌న‌సులో ఉండి మేలుకున్న‌ప్పుడు వ్య‌క్తంగా, నిద్ర‌పోతున్న‌ప్పుడు అవ్య‌క్తంగా ఉంటుంది. ప్రాణ‌శ‌క్తి మాత్ర‌మే మేలుకుని ఉంటుంది. అన్ని ద‌శ‌ల్లో, గాఢ నిద్ర‌లో చూసేది, చూడ‌బ‌డేది ఒక‌టే అయిపోతుంది. అదే ఆత్మ‌. లేదా చైత‌న్యం. అది తెలుసుకోవ‌డ‌మే శాశ్వ‌త ఆనందం’ అన్నాడు.
‘ఆత్మ‌ను ప్రాప్తించుకోవ‌డ‌మ‌న్న‌ది ఆనందానికి ఆధారం’
స‌త్య‌కాముడు ‘గురుదేవా! ఓం అన్న ప‌విత్ర శ‌బ్ధంపై మ‌న‌సు నిలిపి సాధ‌న చేస్తే ఏమ‌వుతుంది.
పిప్పిలాదుడు ‘అది ప్ర‌ణ‌వ‌నాదం. రుగ్‌య‌జుస్సామవేద‌సారం. దానిపై మ‌న‌సు నిలిపితే ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్న‌త శిఖ‌రాల్ని అధిరోహిస్తారు.
First Published:  14 Oct 2018 1:01 PM GMT
Next Story