Telugu Global
NEWS

ప్రణయ్ ఆత్మ ... ఇంటి చుట్టూ తిరుగుతూ ఘోషిస్తోందట.

మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్‌ ఉదంతం ఏదో రూపంలో పదేపదే చర్చకు వస్తోంది. ప్రణయ్‌ భార్య అమృతకు ఇప్పటికీ పరామర్శలు కొనసాగుతున్నాయి. అలా పరామర్శకు వస్తున్న వారిలో కొందరు వింత వ్యక్తులు కూడా ఉంటున్నారు. ఇప్పుడో జంట ప్రణయ్‌ ఆత్మతో మాట్లాడుతామంటోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువుకు చెందిన పొత్తూరు నాగారావు, సత్యప్రియ దంపతులు ప్రణయ్‌ భార్య అమృతను పరామర్శించేందుకు వచ్చారు. తాము అమృతతతోప్రత్యేకంగా మాట్లాడాలని పిలిపించుకున్నారు. ఆ తర్వాత ఆత్మ కథ చెప్పడం మొదలుపెట్టారు. ప్రణయ్‌ ఆత్మ […]

ప్రణయ్ ఆత్మ ... ఇంటి చుట్టూ తిరుగుతూ ఘోషిస్తోందట.
X

మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్‌ ఉదంతం ఏదో రూపంలో పదేపదే చర్చకు వస్తోంది. ప్రణయ్‌ భార్య అమృతకు ఇప్పటికీ పరామర్శలు కొనసాగుతున్నాయి. అలా పరామర్శకు వస్తున్న వారిలో కొందరు వింత వ్యక్తులు కూడా ఉంటున్నారు.

ఇప్పుడో జంట ప్రణయ్‌ ఆత్మతో మాట్లాడుతామంటోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువుకు చెందిన పొత్తూరు నాగారావు, సత్యప్రియ దంపతులు ప్రణయ్‌ భార్య అమృతను పరామర్శించేందుకు వచ్చారు. తాము అమృతతతోప్రత్యేకంగా మాట్లాడాలని పిలిపించుకున్నారు. ఆ తర్వాత ఆత్మ కథ చెప్పడం మొదలుపెట్టారు.

ప్రణయ్‌ ఆత్మ తమతో మాట్లాడుతోందని వారు చెప్పుకొచ్చారు. వచ్చే జన్మలో కూడా ప్రణయ్‌ నీతోనే జీవించాలనుకుంటున్నాడు అంటూ అమృతకు చెప్పారు. నీకోసం ప్రణయ్ ఆత్మ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఘోషిస్తోందని వివరించారు. ప్రణయ్‌ ఆత్మ తమతో మాట్లాడుతోందని… నీతో కూడా మాట్లాడిస్తామంటూ అమృతకు చెప్పారు.

మారుతీరావు, ప్రణయ్‌ మధ్య అసలు పగ ఇప్పటిది కాదని.. గత జన్మలోనే వారిద్దరు శత్రువులను నాగారావు దంపతులు చెప్పారు. ఆ జన్మలో తీరని పగను ఈ జన్మలో మారుతీరావు తీర్చుకున్నారని వివరించారు. ప్రణయ్‌ విగ్రహం పెడితే అతడి ఆత్మ అందులో ఉండిపోతుందని.. కాబట్టి ఆ పని చేయవద్దని సలహా ఇచ్చారు.

వీరు చెప్పిన ఆత్మ కథ విని అనుమానం వచ్చిన ప్రణయ్ కుటుంబసభ్యులుపోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు వచ్చి వారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారు ఎందుకొచ్చారు. వారి ఉద్దేశం ఏమిటి అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

First Published:  15 Oct 2018 6:52 AM IST
Next Story