27న కాంగ్రెస్ లిస్ట్ ! ఉత్తర తెలంగాణపై ఫోకస్ !
తెలంగాణ కాంగ్రెస్ జాబితా విడుదలకు ముహూర్తం ఖరారైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా చెప్పిన దాని ప్రకారం చూస్తే విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఆక్టోబర్ 27న కాంగ్రెస్ లిస్ట్ విడుదల అవుతుందని కుంతియా చెప్పారు. 40 మంది ఉండొచ్చు. ఒకేసారి 90 మంది లిస్ట్ అయినా ఉండొచ్చు అనేది ఆయన మాటల సారాంశం. తెలంగాణ ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా రాహుల్,సోనియా సభలు ఎక్కడా పెట్టాలనే విషయంపై వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. ఉత్తర తెలంగాణలో […]
తెలంగాణ కాంగ్రెస్ జాబితా విడుదలకు ముహూర్తం ఖరారైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా చెప్పిన దాని ప్రకారం చూస్తే విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఆక్టోబర్ 27న కాంగ్రెస్ లిస్ట్ విడుదల అవుతుందని కుంతియా చెప్పారు. 40 మంది ఉండొచ్చు. ఒకేసారి 90 మంది లిస్ట్ అయినా ఉండొచ్చు అనేది ఆయన మాటల సారాంశం.
తెలంగాణ ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా రాహుల్,సోనియా సభలు ఎక్కడా పెట్టాలనే విషయంపై వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. ఉత్తర తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు కొల్లగొట్టాలనేది కాంగ్రెస్ ప్లాన్. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్,నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ గులాబీ కంచుకోటలు. గత ఎన్నికల్లో ఈ ఐదు జిల్లాల్లో కలిపి 54 సీట్లు ఉంటే టీఆర్ఎస్ ఇక్కడ దాదాపుగా 48 సీట్లు గెలిచింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఈ సారి 20 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇక్కడ గెలిస్తే టీఆర్ఎస్ విజయాన్ని ఆపొచ్చనేది కాంగ్రెస్ గేమ్ ప్లాన్ .
ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో ఇక్కడ గెలిచిన కాంగ్రెస్,బీఎస్పీ,టీడీపీ నేతలు ఆతర్వాత టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. దీంతో ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ బలం 51కి చేరింది. కరీంనగర్‌లో 13 స్థానాలు ఉంటే జగిత్యాల మినహా అన్ని స్థానాలు టీఆర్ఎస్ గెలిచింది. ఆదిలాబాద్‌లో 10 సీట్లు ఉంటే నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కోనేరు కొనప్ప, ముథోల్‌లో విఠల్‌రెడ్డి గెలిచారు. కానీ ఆతర్వాత వీరందరూ కారు ఎక్కారు.
మెదక్ 10 సీట్లలో ఒక జహీరాబాద్ మినహా అన్ని సీట్లు టీఆర్ఎస్ దక్కించుకుంది. నారాయణఖేడ్ కాంగ్రెస్ గెలుచుకుంటే…అక్కడ ఉప ఎన్నిక వచ్చి గులాబీ ఖాతాలో చేరిపోయింది. నిజామాబాద్‌లో 9కి తొమ్మది టీఆర్ఎస్‌కే దక్కాయి. వరంగల్ 12 స్థానాల్లో పరకాల, నర్సంపేట, డోర్నకల్ ,పాలకుర్తి మినహా మిగతా స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆతర్వాత పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరిపోయారు,
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ 29 సీట్లు ఉన్నాయి. వీటిలో రంగారెడ్డిలో 14 , హైదరాబాద్ లో 15 సీట్లు ఉన్నాయి. వీటిలో 12కి తక్కువ కాకుండా గెలవాలని కాంగ్రెస్ ప్లాన్. దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్‌లో 14, నల్గొండలో 12 , ఖమ్మంలో 10 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 20 సీట్లకి పైగా గెలుచుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దక్షిణ తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉండడంతో పాటు మహాకూటమిలోని టీడీపీ, సీపీఐ ఓట్లు తమకు తోడైతే కొన్ని జిల్లాలు స్వీప్ చేయొచ్చని కాంగ్రెస్ భావన. అంతేకాకుండా టీఆర్ఎస్ నేతలపై ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతల అంచనా.