Telugu Global
NEWS

రాహుల్‌తో కలిసి చత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తాం....

గద్దర్‌ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా రాహుల్‌ కు తాను పలు పాటలు పాడి వినిపించానని గద్దర్‌ చెప్పారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుతానని రాహుల్ తనకు హామీ ఇచ్చారన్నారు. రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతారన్న దానిపై రాహుల్‌తో చాలా సేపు చర్చించానన్నారు. లౌకికవాదులను ఏకం చేయడంలో తాను అనుసంధానకర్తగా పనిచేస్తానని రాహుల్‌కు వివరించినట్టు గద్దర్ వెల్లడించారు. అందుకు రాహుల్‌ కూడా అంగీకరించారని చెప్పారు. బూర్జువ పార్టీ అయినప్పటికీ కొన్ని అంశాల మీద కలిసి పనిచేయాల్సి […]

రాహుల్‌తో కలిసి చత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తాం....
X

గద్దర్‌ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా రాహుల్‌ కు తాను పలు పాటలు పాడి వినిపించానని గద్దర్‌ చెప్పారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుతానని రాహుల్ తనకు హామీ ఇచ్చారన్నారు. రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతారన్న దానిపై రాహుల్‌తో చాలా సేపు చర్చించానన్నారు.

లౌకికవాదులను ఏకం చేయడంలో తాను అనుసంధానకర్తగా పనిచేస్తానని రాహుల్‌కు వివరించినట్టు గద్దర్ వెల్లడించారు. అందుకు రాహుల్‌ కూడా అంగీకరించారని చెప్పారు. బూర్జువ పార్టీ అయినప్పటికీ కొన్ని అంశాల మీద కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. దొర ఏందిరో అని ప్రశ్నించిన తాము తెలంగాణ ఉద్యమ సమయంలో దొర పక్కన కూర్చోలేదా అని ప్రశ్నించారు.

తెలంగాణలో నయా ప్యూడలిజాన్ని నడుపుతున్న కేసీఆర్‌ను ఎదిరించాలని పిలుపునిచ్చారు. ఓటు ద్వారానే విప్లవం వస్తుందన్నారు. ఓటు ఒక విప్లవ రూపంగా అభివర్ణించారు. రాహుల్‌ గాంధీతో కలిసి త్వరలో ఎన్నికలు జరిగే చత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నట్టు గద్దర్‌ చెప్పారు.

First Published:  14 Oct 2018 1:02 AM IST
Next Story