ఐటీ దాడులు చంద్రబాబుపై జరిగి ఉంటే అండగా ఉండేవాడిని
తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై పవన్ కల్యాణ్ స్పందించారు. విజయవాడలో పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తనను వాడుకున్నారని మండిపడ్డారు. ఐటీ దాడులు వ్యాపారవేత్తలపై జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఐటీ దాడులు సచివాలయంపై జరగలేదు కదా అని నిలదీశారు. సచివాలయం పైనో, చంద్రబాబు ఇంటిపైనో ఐటీ దాడులు జరిగి ఉంటే తాము అండగా ఉండేవారిమన్నారు. […]
తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై పవన్ కల్యాణ్ స్పందించారు. విజయవాడలో పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తనను వాడుకున్నారని మండిపడ్డారు.
ఐటీ దాడులు వ్యాపారవేత్తలపై జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఐటీ దాడులు సచివాలయంపై జరగలేదు కదా అని నిలదీశారు. సచివాలయం పైనో, చంద్రబాబు ఇంటిపైనో ఐటీ దాడులు జరిగి ఉంటే తాము అండగా ఉండేవారిమన్నారు. కానీ వ్యాపారవేత్తలపై దాడులు జరిగితే టీడీపీకి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.
బీజేపీని తానేమీ వెనుకేసుకురావడం లేదన్నారు . ”మోడీ తనకు బ్రదర్ కాదు…. అమిత్ షా నా బాబాయి కాదు” అని వ్యాఖ్యానించారు. ప్రజలకు అండగా ఉంటారనే తాను 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చానన్నారు. కానీ చంద్రబాబు అనుభవం ప్రజలను అయోమయంలోకి నెట్టడానికి మాత్రమే పనికొచ్చిందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత 25 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నామన్నారు. ఏపీలో పర్యటనలు ముగించుకున్న తర్వాత తెలంగాణ గురించి ఆలోచిద్దామనుకునే సమయంలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయన్నారు. తెలంగాణలో పోటీ చేసే అంశంపై నాలుగైదు రోజుల్లోనే మీడియా సమావేశం పెట్టి స్పష్టత ఇస్తామన్నారు పవన్.